Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:29 PM

అంబులెన్స్‌లో ప్రసవం – 2 కిలోమీటర్లు మోసి తీసుకెళ్లిన 108 సిబ్బంది సేవలకు ప్రశంసలు

27-04-2026 172 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలం అమ్మనబోలు గ్రామంలో ఓ గర్భిణి అంబులెన్స్‌లోనే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఘటన చోటుచేసుకుంది. మహారాష్ట్రకు చెందిన రోషిణి (20) అనే మహిళ ఇటుకబట్టిలో పనిచేస్తూ ఉండగా అకస్మాత్తుగా పురిటినొప్పులు రావడంతో గ్రామస్థులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు.

శాలిగౌరారం 108 సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నప్పటికీ, మహిళ ఉన్న ప్రాంతానికి అంబులెన్స్ వెళ్లే వీలు లేకపోవడంతో సిబ్బంది ఆమెను సుమారు 2 కిలోమీటర్ల దూరం స్కూప్ స్ట్రక్చర్‌పై మోసుకుంటూ అంబులెన్స్‌ వరకు తీసుకొచ్చారు. అనంతరం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే అంబులెన్స్‌లో రోషిణి సాఫల్యంగా ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

ఈ సందర్భంగా గర్భిణిని ఎండలో రెండు కిలోమీటర్ల పాటు మోసి ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడిన 108 సిబ్బంది పైలెట్ సమీర్, ఈఎంటీ హేమంత్ సేవలను స్థానికులు అభినందించారు.

Sthanikam

అంబులెన్స్‌లో ప్రసవం – 2 కిలోమీటర్లు మోసి తీసుకెళ్లిన 108 సిబ్బంది సేవలకు ప్రశంసలు

Article Image

నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలం అమ్మనబోలు గ్రామంలో ఓ గర్భిణి అంబులెన్స్‌లోనే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఘటన చోటుచేసుకుంది. మహారాష్ట్రకు చెందిన రోషిణి (20) అనే మహిళ ఇటుకబట్టిలో పనిచేస్తూ ఉండగా అకస్మాత్తుగా పురిటినొప్పులు రావడంతో గ్రామస్థులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు.

శాలిగౌరారం 108 సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నప్పటికీ, మహిళ ఉన్న ప్రాంతానికి అంబులెన్స్ వెళ్లే వీలు లేకపోవడంతో సిబ్బంది ఆమెను సుమారు 2 కిలోమీటర్ల దూరం స్కూప్ స్ట్రక్చర్‌పై మోసుకుంటూ అంబులెన్స్‌ వరకు తీసుకొచ్చారు. అనంతరం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే అంబులెన్స్‌లో రోషిణి సాఫల్యంగా ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

ఈ సందర్భంగా గర్భిణిని ఎండలో రెండు కిలోమీటర్ల పాటు మోసి ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడిన 108 సిబ్బంది పైలెట్ సమీర్, ఈఎంటీ హేమంత్ సేవలను స్థానికులు అభినందించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News