Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 05:38 AM

అంబేద్కర్ యూనివర్సిటీకి భారీ నిధులు: సీఎం, డిప్యూటీ సీఎంకు ఉద్యోగ సంఘాల కృతజ్ఞతలు

24-03-2026 46 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్‌లోని డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం భారీ నిధులు కేటాయించడంతో ఉద్యోగ సంఘాలు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపారు.

తాజా రాష్ట్ర బడ్జెట్‌లో విశ్వవిద్యాలయ మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.50 కోట్లు, ఉద్యోగుల వేతనాల కోసం రూ.24.30 కోట్లు కేటాయించడంతో పాటు, ఇప్పటికే అంబేద్కర్ అంతర్జాతీయ పరిశోధనా కేంద్రం కోసం రూ.100 కోట్లు మంజూరు చేసిన విషయాన్ని సంఘాల ప్రతినిధులు గుర్తుచేశారు.

ఈ సందర్భంగా బోధనేతర, టెక్నికల్ ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ, రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి అత్యధిక అభివృద్ధి గ్రాంటు లభించడం గర్వకారణమన్నారు. ఇది విశ్వవిద్యాలయంపై ప్రభుత్వ విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు.

ఈ నిధులతో విశ్వవిద్యాలయంలో మౌలిక వసతుల అభివృద్ధి వేగవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Sthanikam

అంబేద్కర్ యూనివర్సిటీకి భారీ నిధులు: సీఎం, డిప్యూటీ సీఎంకు ఉద్యోగ సంఘాల కృతజ్ఞతలు

Article Image

హైదరాబాద్‌లోని డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం భారీ నిధులు కేటాయించడంతో ఉద్యోగ సంఘాలు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపారు.

తాజా రాష్ట్ర బడ్జెట్‌లో విశ్వవిద్యాలయ మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.50 కోట్లు, ఉద్యోగుల వేతనాల కోసం రూ.24.30 కోట్లు కేటాయించడంతో పాటు, ఇప్పటికే అంబేద్కర్ అంతర్జాతీయ పరిశోధనా కేంద్రం కోసం రూ.100 కోట్లు మంజూరు చేసిన విషయాన్ని సంఘాల ప్రతినిధులు గుర్తుచేశారు.

ఈ సందర్భంగా బోధనేతర, టెక్నికల్ ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ, రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి అత్యధిక అభివృద్ధి గ్రాంటు లభించడం గర్వకారణమన్నారు. ఇది విశ్వవిద్యాలయంపై ప్రభుత్వ విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు.

ఈ నిధులతో విశ్వవిద్యాలయంలో మౌలిక వసతుల అభివృద్ధి వేగవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News