Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 03:46 AM

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ – TCS iON ప్రోగ్రామ్‌తో ఉపాధి అవకాశాలు

15-03-2026 71 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

డిగ్రీతో పాటు స్కిల్ కోర్సులు పూర్తి చేసుకునే అవకాశం – ప్రొ. పల్లవీ కాబడె

హైదరాబాద్,

డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మరియు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS iON) సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘TCS iON – జాబ్ అచీవర్ బిజినెస్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్’ ప్రోగ్రామ్ విద్యార్థులకు విస్తృత ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్కిల్ డెవలప్మెంట్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్ కోఆర్డినేటర్ ప్రొ. పల్లవీ కాబడె, అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. రాఘవేంద్ర తెలిపారు.

సిటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మరియు కూకట్‌పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ ప్రోగ్రామ్‌పై నిర్వహించిన అవగాహనా కార్యక్రమాల్లో వారు మాట్లాడారు. దూరవిద్య ద్వారా ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులను కార్పొరేట్ రంగానికి అవసరమైన నైపుణ్యాలతో తీర్చిదిద్దే ఉద్దేశంతో ఈ కోర్సును రూపొందించామని తెలిపారు. డిగ్రీ చదువుతూనే ఈ కోర్సును పూర్తి చేయవచ్చని పేర్కొన్నారు.

ఈ కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులకు టీసీఎస్ iON ఆధ్వర్యంలో సుమారు 3,500కు పైగా భాగస్వామ్య సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశముందని వివరించారు. మహిళా విద్యార్థులను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు WeHub తో ప్రత్యేక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. అలాగే RASCI, శ్రీ రామానంద తీర్థ రూరల్ ఇన్‌స్టిట్యూట్ వంటి ప్రముఖ సంస్థలతో కూడా ఒప్పందాలు ఉన్నాయని చెప్పారు.

విద్యార్థుల కెరీర్ అభివృద్ధి కోసం నైపుణ్యాల పెంపు, ఆంగ్ల భాషలో ప్రావీణ్యం సాధించేందుకు వర్క్‌షాప్‌లు, వీడియో కంటెంట్, క్విజ్‌లు, ప్రాక్టికల్ సెషన్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

వీసీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రొ. ఘంటా చక్రపాణి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉపాధి అవకాశాలు పెంచే దిశగా యూనివర్సిటీ పలు నూతన కార్యక్రమాలను ప్రారంభించిందని చెప్పారు. సమతా స్కీమ్ కింద ఉచిత విద్య, నిపుణ స్కీమ్ కింద ఫెలోషిప్‌లు అందిస్తున్నట్లు తెలిపారు.

కార్యక్రమంలో కోఆర్డినేటర్ ప్రొ. శంకర్, అధ్యాపకులు డా. శంకర్, డా. మఖ్దూమ్, సిటీ కళాశాల అధ్యాపకులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ – TCS iON ప్రోగ్రామ్‌తో ఉపాధి అవకాశాలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News