Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:36 AM

అంబేద్కర్ ఆశయాలే మోదీ ప్రభుత్వ లక్ష్యం – బీజేపీ

14-04-2026 55 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట,

భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా రామన్నపేట మండల కేంద్రంలో ఘనంగా నివాళులర్పించారు. భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు బండ మధుకర్ రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి స్మరించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గ ఇన్చార్జి నకిరేగంటి మొగులయ్య, మండల ఇన్చార్జి కొరివి శంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలోని అసమానతలను తొలగించి ప్రతి వర్గానికి సమాన న్యాయం అందించాలన్న అంబేద్కర్ ఆశయాలు దేశానికి మార్గదర్శకమని పేర్కొన్నారు.

గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం “సబ్ కా సాథ్, సబ్ కా వికాస్” స్ఫూర్తితో సామాజిక సాధికారత దిశగా ముందుకు సాగుతోందని తెలిపారు. మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న చారిత్రక నిర్ణయాలే అంబేద్కర్ గారికి నిజమైన నివాళిగా నిలుస్తాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు మనం అంజయ్య, జిల్లా కార్యదర్శి తాటిపాముల శివకృష్ణ గౌడ్, సీనియర్ నాయకులు కట్ట యాదయ్య, గోపవరం ధర్మరాజు, మద్దెలపూరి ఐలయ్య, జిల్లా లక్ష్మీనారాయణ, రాపోలు స్వామి, బీజేవైఎం జిల్లా కార్యదర్శి అక్కెనపల్లి సైదులు, మండల జనరల్ సెక్రటరీలు బెజ్జంకి శివకుమార్, జంగిలి సత్యనారాయణ, ఉపాధ్యక్షులు కంభంపాటి శివరంజని, బట్టి రమేష్, కార్యదర్శులు బతక్క నరేష్, బందెల సంజీవ, రేపాక లింగస్వామి, బీజేపీ నాయకులు వావిళ్ళ సంతోష్, ఐలాపురం అశోక్, మచ్చ మహేష్, బోయపల్లి ప్రవీణ్, బతక్క సైదులు, వీరమల్ల గణేష్, సురవి మల్లేష్, బొడ్డుపల్లి సైదులు, సిల్వర్ తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అంబేద్కర్ ఆశయాలే మోదీ ప్రభుత్వ లక్ష్యం – బీజేపీ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News