Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:42 AM

అంబేద్కర్ ఆశయాల అమలే నిజమైన నివాళి. మాజీ ఎంపీటీసీ కన్నెకంటి వెంకటేశ్వరాచారి

14-04-2026 83 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కలలుగన్న సమసమాజ స్థాపన కోసం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందని బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీటీసీ కన్నెకంటి వెంకటేశ్వరాచారి అన్నారు.

అంబేద్కర్ జయంతి సందర్భంగా మండలంలోని మునిపంపుల గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ కుల నిర్మూలన కోసం విశేష కృషి చేసి సమాజంలో సమానత్వం కోసం పోరాడిన మహానుభావుడని కొనియాడారు.

దేశంలోని ప్రతి రాజకీయ పార్టీపై అంబేద్కర్ ప్రభావం ఉందని, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్లమెంట్‌లో అంబేద్కర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేయడం ఆయనకు ఇచ్చిన గౌరవానికి నిదర్శనమని తెలిపారు. 1990లో బీజేపీ మద్దతుతో ఉన్న ప్రభుత్వం అంబేద్కర్‌కు భారతరత్న పురస్కారం ప్రదానం చేయడం గర్వకారణమని గుర్తుచేశారు.

అంబేద్కర్ జీవితానికి సంబంధించిన ఐదు ప్రధాన ప్రదేశాలను గుర్తించి ‘పంచతీర్థాలు’గా అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ఆయన ఆశయాలను కొనసాగించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు యాదాసు లక్ష్మణ్, సీనియర్ నాయకులు డోగిపర్తి భాస్కర్, ఏలూరు రవి, సిందం లింగయ్య, గుండాల అంజయ్య, చోల్లేటి చంద్రశేఖరాచారి, బూడిద కిరణ్, కర్నాటి నరేష్, కర్నాటి రాము, బూడిద మల్లేష్, పాలాల శేఖర్, కూరెళ్ల రామకృష్ణ, గాదే స్వామి, సురపల్లి వీరేందర్, బూడిద గణేష్, కన్నెకంటి వేణు మాధవ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అంబేద్కర్ ఆశయాల అమలే నిజమైన నివాళి. మాజీ ఎంపీటీసీ కన్నెకంటి వెంకటేశ్వరాచారి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News