Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 24, 2026 11:22 PM

అంబటి అనుదీప్ మరణంపై పూర్తి స్థాయి విచారణ జరపాలి: రాష్ట్ర కాపు జేఏసీ కుట్రదారులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్

18-03-2026 177 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి,

అంబటి దివ్య అనుదీప్ అనుమానాస్పద మరణంపై సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు వెలికితీయాలని రాష్ట్ర కాపు జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) అధ్యక్షుడు చందు జనార్దన్ డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

బుధవారం నూజివీడు నియోజకవర్గంలోని చాట్రాయి గ్రామంలో అనుదీప్ స్వగృహాన్ని సందర్శించిన చందు జనార్దన్, కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం స్థానికంగా పెద్ద సంఖ్యలో హాజరైన కాపు కుటుంబాల సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఈ ఘటన వెనుక ఉన్న అసలు కారణాలను వెలికితీయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

మృతుడు అనుదీప్ తండ్రి అంబటి గోపాలరావు మాట్లాడుతూ, గత వారం తమ ఇంటికి వచ్చి తన కుమారుడిని చంపుతామని బెదిరింపులు చేశారని, ఆ బెదిరింపులకే అనుగుణంగా హత్య జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి నిందితులను అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా రాష్ట్ర కాపు జేఏసీ నాయకులు మాట్లాడుతూ, త్వరలో జిల్లా ఎస్పీని కలిసి కేసు విచారణపై ఒత్తిడి తీసుకురానున్నామని తెలిపారు. అవసరమైతే ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయం సాధించేందుకు వెనుకాడబోమని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో కమ్ముల కొండలరావు, బి.శెట్టి ప్రసాద్, ప్రముఖ న్యాయవాది కోటిపల్లి అయ్యప్ప, అంబటి సత్యనారాయణ, శ్రీరాములు సత్యనారాయణ, సవరం రామారావు, బండి శ్రీనివాసరెడ్డి, పసుపులేటి వెంకటేశ్వరరావు, అంబటి చంద్రశేఖర్, ఉజ్జిగిరి నరసింహారావు, పసుపులేటి సత్యనారాయణ, కొల్లా శ్రీకాంత్, పసుపులేటి రంగారావు, అంబటి రాంబాబు, మండా సమీర్, కంపసాటి మారేశ్వరరావు, నెల్లూరు మురళి, అంబటి శ్రీనివాసరావు, సదరు రాజేష్, గాజుల ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని కాపు జేఏసీ నేతలు హెచ్చరించారు.

Sthanikam

అంబటి అనుదీప్ మరణంపై పూర్తి స్థాయి విచారణ జరపాలి: రాష్ట్ర కాపు జేఏసీ కుట్రదారులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News