విద్యారంగంలోని సమస్యలు పరిష్కరించాలి
విద్యారంగంలోని సమస్యలు పరిష్కరించాలి
Harish K
విద్యారంగ సమస్యల పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని ఐక్య విద్యార్థి, యువజన సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాలు ఇచ్చిన రాష్ట్రవ్యాప్త బంద్ పిలుపులో భాగంగా కోదాడ పట్టణంలో విద్యాసంస్థల బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా పి డి ఎస్ యు జిల్లా ఉపాధ్యక్షులు పులి రాఖి, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నరేష్, పి డి ఎస్ యు జిల్లా కార్యదర్శి చందర్రావు, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కొండల్, పివైఎల్ జిల్లా కార్యదర్శి డి రవి, టిఆర్ఎస్వి పట్టణ నాయకులు సాయి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు విద్యార్థులకు అనేక హామీలు ఇచ్చి ఈరోజు విద్యార్థి వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 27 వేల ప్రభుత్వ పాఠశాలను కుదించి నాలుగు పాఠశాలలుగా ఏర్పాటు చేస్తానని స్వయన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించడం అంటే పేద విద్యార్థుల పట్ల ప్రభుత్వ పాఠశాల పట్ల ఎంత కుట్ర పన్నుతున్నారో అర్థం చేసుకోవాలని అన్నారు. రాష్ట్రంలోని ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలో ఫీజుల పేరుతో వేలకు వేలు వసూలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యాహక్కు చట్టం ప్రకారం ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయకుండా నిర్లక్ష్యం వహించడం దేనికి నిదర్శనం అని వారు ప్రశ్నించారు. ఫీజు నియంత్రణ చట్టం అమలు చేసి విద్య వ్యాపారాన్ని అరికట్టాలని వారు కోరారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్లను వెంటనే విడుదల చేయాలని, ప్రభుత్వ పాఠశాలలో ఉన్న మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఖాళీగా ఉన్న అన్ని రకాల పోస్ట్లు భర్తీ చేయాలని, విద్యార్థులకు అందించాల్సిన పాఠ్యపుస్తకాలు, 2 జతల దుస్తులు వెంటనే అందించాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. లేనిపక్షంలో ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యు, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, పివైఎల్, బిఆర్ఎస్వి సంఘాల నాయకులు ఉదయ్ కిరణ్, రామకృష్ణ సురేష్ నవీన్ సతీష్ సైదులు పరమేష్ పరశురాం మహేష్ కళ్యాణి సంధ్య అనురాధ రేణుక తదితరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి