Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధితులను పరామర్శించేందుకూ అడ్డంకులా?. “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 02:35 PM

25న పోలీస్ వాహన విడిభాగాల బహిరంగ వేలం ఎస్పీ శరత్ చంద్ర పవార్

20-03-2026 77 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ, : జిల్లా పోలీస్ కార్యాలయంలోని మోటర్ ట్రాన్స్‌పోర్ట్ (ఎం.టి) విభాగానికి చెందిన పాత టైర్లు, బ్యాటరీలు, ఇతర ఇనుప విడిభాగాలకు ఈ నెల 25వ తేదీన బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం ఉదయం 10 గంటలకు జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో ఈ వేలం ప్రక్రియ ప్రారంభం కానుంది. పోలీస్ వాహనాలకు సంబంధించి కాలం చెల్లిన ఉపయోగించని వివిధ రకాల పాత టైర్లు, పాత బ్యాటరీలు, ఆయిల్ డ్రమ్ములు, ఇనుప స్పేర్ పార్ట్స్ తదితర వస్తువులను ఈ సందర్భంగా వేలం వేయనున్నారు. ఆసక్తి కలిగిన వారు నిర్ణీత సమయానికి జిల్లా పోలీస్ కార్యాలయానికి హాజరై వేలంలో పాల్గొనవచ్చని ఎస్పీ సూచించారు.ఈ వేలం ప్రక్రియకు సంబంధించిన ఇతర పూర్తి వివరాల కోసం మోటర్ ట్రాన్స్‌పోర్ట్ ఇన్స్‌పెక్టర్ (RI) శ్రీ సూరపు నాయుడు గారిని సంప్రదించాలని ఆయన కోరారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అత్యధిక ధర పలికిన వారికే ఈ వస్తువులను కేటాయించడం జరుగుతుందని స్పష్టం చేశారు.

Sthanikam

25న పోలీస్ వాహన విడిభాగాల బహిరంగ వేలం ఎస్పీ శరత్ చంద్ర పవార్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News