Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:10 PM

25 ఏళ్ల తర్వాత అపూర్వ కలయిక

25 ఏళ్ల తర్వాత అపూర్వ కలయిక

25 ఏళ్ల తర్వాత అపూర్వ కలయిక
29-01-2026 190 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ జెడ్ పి హెచ్ ఎస్ 1998–99 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

చౌటుప్పల్ స్థానికం ప్రతినిధి కె రవి

కాలం దూరం చేసిన స్నేహ బంధాలు, బాల్య జ్ఞాపకాలతో నిండిన స్నేహాలు మరోసారి హృదయాలను దగ్గర చేసుకున్నాయి. చౌటుప్పల్ జెడ్ పి హెచ్ ఎస్ హై స్కూల్ 1998–99 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు 25 ఏళ్ల తర్వాత నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం భావోద్వేగాలతో,ఆనందోత్సాహాలతో ఘనంగా జరిగింది. మల్కాపురం ఆందోల్ మైసమ్మ ఆవరణలో జరిగిన ఈ రీయూనియన్‌కు పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పాఠశాల జీవితం ఇచ్చిన మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, అప్పటి అనుభవాలు, గురువుల మార్గదర్శకత్వం, విద్యార్థి దశలోని సరదా క్షణాలను ఒకరితో ఒకరు పంచుకున్నారు. కాలం ఎంత మారినా స్నేహం మాత్రం అలాగే నిలిచిందని ఈ కలయిక మరోసారి రుజువు చేసింది. ముఖ్య అతిథులుగా విచ్చేసిన నాటి ఉపాధ్యాయులను పూల వర్షంతో, పుష్పగుచ్చాలతో ఘనంగా స్వాగతించారు.విద్యార్థుల స్వీయ పరిచయంతో మొదలైన కార్యక్రమం, జీవిత ప్రయాణంలోని అనుభవాలను పంచుకునే వేడుకగా మారింది. గురువులు అందించిన విలువలు తమ జీవితాలకు బలంగా నిలిచాయని పలువురు విద్యార్థులు భావోద్వేగంగా వెల్లడించారు. పాఠశాల నేర్పిన క్రమశిక్షణ, బాధ్యత, మానవ విలువలు తమ విజయాలకు పునాదిగా నిలిచాయని గుర్తు చేసుకున్నారు.

Sthanikam

25 ఏళ్ల తర్వాత అపూర్వ కలయిక

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News