Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:00 PM

యువతలో దేశభక్తి స్పూర్తి: బోరంచలో శివాజీ మహారాజ్ ఘనోత్సవం

19-02-2026 142 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధిలోని మానూర్ మండలం లోని బోరంచ గ్రామంలో గురువారం రోజు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం శంకుస్థాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా, భక్తి శ్రద్ధల మధ్య నిర్వహించబడింది. గ్రామం అంతటా పండుగ వాతావరణం నెలకొంది. గ్రామస్తులు, యువత, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో డప్పులు, తాళాలు మోగిస్తూ, జెండాలు ఎగురవేస్తూ శివాజీ మహారాజ్ జయజయధ్వానాలతో గ్రామం మార్మోగింది. ప్రముఖులు, స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొని శివాజీ మహారాజ్ దేశభక్తి, పరాక్రమం, ధైర్యసాహసాల గురించి వివరించారు. యువతలో దేశభక్తి స్పూర్తిని పెంపొందించడంలో శివాజీ మహారాజ్ జీవితం ఆదర్శమని వారు పేర్కొన్నారు.వేద మంత్రాల నడుమ పూజా కార్యక్రమాలు నిర్వహించి, శంకుస్థాపన చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించి, భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. గ్రామ ప్రజల సహకారంతో ఈ మహోత్సవం విజయవంతంగా నిర్వహించబడటం విశేషం.గ్రామంలో శివాజీ మహారాజ్ విగ్రహం ఏర్పాటుతో యువతలో జాతీయ భావం మరింత బలపడుతుందని, భవిష్యత్ తరాలకు ఇది స్ఫూర్తిదాయక కేంద్రంగా నిలుస్తుందని గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం బోరంచ గ్రామ చరిత్రలో చిరస్మరణీయ ఘట్టంగా నిలిచిపోతుందని అందరూ పేర్కొన్నారు.

Sthanikam

యువతలో దేశభక్తి స్పూర్తి: బోరంచలో శివాజీ మహారాజ్ ఘనోత్సవం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News