Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:03 PM

యువత రాజ్యాంగ అవగాహనతో దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలి

26-01-2026 82 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఉమ్మడి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ

భారత రాజ్యాంగాన్ని రక్షించడం ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత అని ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ నవోదయ సిద్దు అన్నారు.భారతదేశం పూర్తి స్థాయి గణతంత్రంగా అవతరించిన రోజు జనవరి 26 అని ఆయన గుర్తు చేశారు. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి రావడంతో, దేశ ప్రజలకు సమాన హక్కులు, స్వేచ్ఛ, న్యాయం లభించాయని చెప్పారు. ఈ రోజున జరుపుకునే గణతంత్ర దినోత్సవం ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల అవగాహన పెంచడానికి ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.గణతంత్ర దినోత్సవం కేవలం పండుగ మాత్రమే కాక, రాజ్యాంగం విలువలను గౌరవించే రోజు అని నవోదయ సిద్దు అన్నారు. దేశ స్వాతంత్ర్యానికి, రాజ్యాంగ నిర్మాణానికి ప్రాణాలను అర్పించిన మహనీయుల త్యాగాలను స్మరించుకోవడం ముఖ్యమని సూచించారు.ప్రతి పౌరుడు తన హక్కులను మాత్రమే కాక, బాధ్యతలను కూడా గుర్తించాలి. అప్పుడే దేశం నిజమైన గణతంత్ర దేశంగా ముందుకు సాగగలదని ఆయన భావన వ్యక్తం చేశారు. యువతలో రాజ్యాంగం పట్ల అవగాహన పెంపొందించడం ద్వారా వారు దేశాభివృద్ధిలో స్ఫూర్తిదాయకంగా పాల్గొనగలరని పిలుపునిచ్చారు.

Sthanikam

యువత రాజ్యాంగ అవగాహనతో దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News