Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:16 AM

యువత ముందుకు వస్తేనే ఆరోగ్యవంతమైన సమాజం – కలెక్టర్ ప్రావీణ్య

యువత ముందుకు వస్తేనే ఆరోగ్యవంతమైన సమాజం – కలెక్టర్ ప్రావీణ్య

యువత ముందుకు వస్తేనే ఆరోగ్యవంతమైన సమాజం – కలెక్టర్ ప్రావీణ్య
April 07, 2026 05:04 PM 55 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన 5కే రన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ అంజిరెడ్డి, జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య కలిసి జెండా ఊపి ప్రారంభించారు. మెడికల్ కాలేజీ నుంచి ఐబి వరకు కొనసాగిన ఈ రన్‌లో విద్యార్థులు, యువత, అధికారులు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య మాట్లాడుతూ ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు పలు ఆరోగ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఆరోగ్యకరమైన జీవన విధానం ద్వారా వ్యక్తిగతంగా, సామాజికంగా అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు.సాధారణంగా మధ్య వయస్సు వచ్చిన తర్వాతే ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతుందని, కానీ ప్రస్తుత యువత ముందుగానే ఆరోగ్యంపై దృష్టి సారించడం శుభపరిణామమని పేర్కొన్నారు.ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించినట్లుగా సమతుల్య ఆహారం, వ్యాయామం,పరిశుభ్రత, మానసిక ప్రశాంతత ఆరోగ్యానికి ముఖ్యమైన అంశాలని, యువత ఇవి పాటించి భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ ప్రతి వ్యక్తి శాస్త్రీయ దృక్పథంతో జీవిస్తూ జీవనశైలిలో మార్పులు చేసుకుంటే అనారోగ్య సమస్యలను నివారించవచ్చని, రోజువారీ జీవితంలో ఒత్తిడి, చిరాకు తగ్గించుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు.యువత ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పాండు, ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రకాష్ రావు, జిల్లా వైద్యాధికారి డాక్టర్ వసంతరావు, డీఎస్పీ సత్తయ్య, అధికారులు, ప్రజాప్రతినిధులు, యువజన సంఘాలు, మెడికల్ విద్యార్థులు మరియు ప్రజలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News