Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:56 AM

యువత బాధ్యతగా ముందుకు రావాలి – ట్రాఫిక్ అవగాహన సందేశం

యువత బాధ్యతగా ముందుకు రావాలి – ట్రాఫిక్ అవగాహన సందేశం

యువత బాధ్యతగా ముందుకు రావాలి – ట్రాఫిక్ అవగాహన సందేశం
March 28, 2026 06:41 PM 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పట్టణంలోని ట్రాఫిక్ నిబంధనలు పాటించి రోడ్డు ప్రమాదాలను నివారించాలనే లక్ష్యంతో తారా ప్రభుత్వ కళాశాల, సంగారెడ్డి ఎన్ఎస్ఎస్ విభాగాలు 2, 3, 4 ఆధ్వర్యంలో దత్తత గ్రామాలైన కల్పగుర్, అంగడిపేట్, మల్కాపూర్ గ్రామాల్లో ప్రత్యేక శిబిరాల సందర్భంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు అని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రవీణ తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ట్రాఫిక్ నియమాలు, సైబర్ క్రైమ్, పోక్సో చట్టంపై ర్యాలీలు, సదస్సులు నిర్వహించి విద్యార్థులు, గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ముఖ్య అతిథులుగా హాజరైన ట్రాఫిక్ ఎస్ఐలు సాయిలు, రాములు, గోప్య చౌహన్ ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించడం, హెల్మెట్ ధరించడం, లైసెన్స్ మరియు వాహన పత్రాలు కలిగి ఉండడం తప్పనిసరి అని సూచించగా, మద్యం సేవించి వాహనం నడపరాదని హెచ్చరించారు. అలాగే సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, అపరిచితుల మెసేజ్లు, ఓటీపీలు పంచుకోవద్దని, మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్‌కు సంప్రదించాలని తెలిపారు. బాలికల రక్షణకు సంబంధించిన పోక్సో చట్టంపై కూడా అవగాహన కల్పించారు.ట్రాఫిక్ పరికరాల వినియోగాన్ని ప్రత్యక్షంగా చూపించి విద్యార్థులకు వివరించగా,ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించి ఆరోగ్యం, విద్య, సామాజిక అంశాలపై ప్రజల్లో చైతన్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, ట్రాఫిక్ పోలీసులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News