ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
సూర్యాపేట పట్టణంలోని జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఏలిమినేటి అభినయ్ నాయుడు నివాసంలో యువజన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సర్వోత్తమ్ రెడ్డి మాట్లాడుతూ యువజన కాంగ్రెస్ ను గ్రామ స్థాయిలో బలోపేతం చేసేందుకు కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. నియోజకవర్గ పరిధిలోని మండల, గ్రామ కమిటీలను ఏర్పాటు చేసి పార్టీని మరింత బలపరచాలని అన్నారు.ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రతి అర్హుడికి చేరేలా చూడడం యువజన నాయకుల బాధ్యత అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి