Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 05:17 AM

యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం

యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం

యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం
January 28, 2026 05:02 PM 60 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి.

బిఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ ప్రజాస్వామ్య విరుద్ధ వ్యాఖ్యలు, అవమానకర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపిస్తూ నకిరేకల్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ దిష్టిబొమ్మను ప్రతీకారత్మకంగా దగ్ధం చేస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన స్కిట్‌లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, శాసనసభ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్, జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ లను వ్యక్తిత్వ హననం చేస్తూ అవమానించారని యువజన కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని స్మరించుకునే పవిత్రమైన రోజున ఇలాంటి దిగజారిన రాజకీయాలు చేయడం ప్రజాస్వామ్యానికి అవమానమని వారు విమర్శించారు.ఈ సందర్భంగా నకిరేకల్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఏనుగు రఘుమారెడ్డి మాట్లాడుతూ, గణతంత్ర దినోత్సవం లాంటి పవిత్రమైన రోజున ప్రజలను తప్పుదారి పట్టించే స్కిట్లు ప్రదర్శించడం రాజ్యాంగ విలువలకు విరుద్ధమన్నారు. బీఆర్ఎస్ ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా యువజన కాంగ్రెస్ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా చిట్యాల మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు దామనూరి పృథ్వి, జిల్లా నాయకులు గోలి మహేష్, నారగోని నాగరాజు, బెల్లంకొండ రఘుగౌడ్, ఆకుల కృష్ణ, మెట్టు వెంకటేష్, జవాజీ శేఖర్, అందె చందు యాదవ్, అందె నరేష్, దోర్నాల వంశీ, నూతి తిరుమలేష్, కూరాకుల సుధీర్, చిర్రగోని శ్రీశైలం, గాదె ప్రశాంత్, చిన్నం వెంకటేష్, అందె బన్ని యాదవ్, కేషబోయిన మత్స్యగిరి తదితరులు పాల్గొన్నారు. అలాగే సీనియర్ కాంగ్రెస్ నాయకులు అంశాల సత్యనారాయణ, ఏనుగు పద్మారెడ్డి, మంకాల లింగస్వామి, దేవిరెడ్డి లింగారెడ్డి పాల్గొని బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News