Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / హైదరాబాద్

యువ న్యాయవాది హత్య.. చేవెళ్ల కోర్టు బహిష్కరణతో భగ్గుమన్న న్యాయవాదుల ఆగ్రహం

Updated : 05 Feb 2026 01:03 IST
As Preferred Source 1 min read
యువ న్యాయవాది హత్య.. చేవెళ్ల కోర్టు బహిష్కరణతో భగ్గుమన్న న్యాయవాదుల ఆగ్రహం

హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లి గ్రామంలో యువ న్యాయవాది దారుణ హత్యకు గురికావడం కలకలం రేపింది. స్వప్న (34) అనే న్యాయవాదిని గుర్తుతెలియని దుండగులు గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు గల కారణాలపై పలు కోణాల్లో విచారణ కొనసాగుతోంది.ఈ దారుణ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ చేవెళ్ల కోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసనకు దిగారు. న్యాయవాదుల భద్రతపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని, నిందితులను త్వరితగతిన అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు.యువ న్యాయవాది హత్యతో న్యాయవర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొనగా, న్యాయవాదుల రక్షణ అంశంపై మరోసారి చర్చ మొదలైంది.

Sthanikam

యువ న్యాయవాది హత్య.. చేవెళ్ల కోర్టు బహిష్కరణతో భగ్గుమన్న న్యాయవాదుల ఆగ్రహం

Article Image

హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లి గ్రామంలో యువ న్యాయవాది దారుణ హత్యకు గురికావడం కలకలం రేపింది. స్వప్న (34) అనే న్యాయవాదిని గుర్తుతెలియని దుండగులు గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు గల కారణాలపై పలు కోణాల్లో విచారణ కొనసాగుతోంది.ఈ దారుణ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ చేవెళ్ల కోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసనకు దిగారు. న్యాయవాదుల భద్రతపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని, నిందితులను త్వరితగతిన అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు.యువ న్యాయవాది హత్యతో న్యాయవర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొనగా, న్యాయవాదుల రక్షణ అంశంపై మరోసారి చర్చ మొదలైంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి