Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:13 PM

యూరియా ఆన్‌లైన్ బుకింగ్ రద్దు చేయాలి: ఆవుల నాగరాజు యాదవ్

22-02-2026 260 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

రాష్ట్రంలో అమలవుతున్న యూరియా ఆన్‌లైన్ బుకింగ్ విధానాన్ని తక్షణమే రద్దు చేసి, పాత విధానంలోనే రైతులకు ఎరువులు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గుండ్రంపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మాజీ వైస్ చైర్మన్ ఆవుల నాగరాజు యాదవ్ డిమాండ్ చేశారు. ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.ఆన్‌లైన్ బుకింగ్ విధానం పై గ్రామీణ ప్రాంతాల రైతులకు సరైన అవగాహన లేకపోవడంతో వారు తీవ్రఇబ్బందులుఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ లేదా ఇంటర్నెట్ సౌకర్యం లేని రైతులు ఇతరుల సహాయంపై ఆధారపడాల్సివస్తోందన్నారుయూరియా నిల్వ ఉన్న డీలర్లు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్య మాత్రమేఆన్‌లైన్బుకింగ్‌కుఅవకాశంకల్పిస్తున్నారని, అయితే కేవలం పది నిమిషాల్లోనే స్టాక్ అయిపోయిందని ప్రకటించడం రైతులనుఆశ్చర్యానికిగురిచేస్తోందని పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో పారదర్శకత లోపిస్తోందనే అనుమానాలువ్యక్తమవుతున్నాయని తెలిపారు.సకాలంలో యూరియా అందక పంటలు దెబ్బతింటున్నాయని, సాగు పనులు ముమ్మరంగా సాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ విధానం రైతులకు ఇబ్బందికరంగా మారిందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల సమస్యలను పరిష్కరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.రైతు సంక్షేమం దృష్ట్యా ఆన్‌లైన్ విధానాన్నిపునఃసమీక్షించి, పాత విధానంలో సరఫరా పునరుద్ధరించాలని ఆవుల నాగరాజు యాదవ్ కోరారు.

Sthanikam

యూరియా ఆన్‌లైన్ బుకింగ్ రద్దు చేయాలి: ఆవుల నాగరాజు యాదవ్

Article Image

మీ స్పందన? 7 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News