Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్షియన్ పిల్లి ‘లియో’ అదృశ్యం.. ఆచూకీ తెలిపితే రూ.10 వేల బహుమతి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 11:43 AM

యూరియాను యాప్ విధానంలో కాకుండా నేరుగా ఇవ్వాలి

12-02-2026 178 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్

తహసీల్దారుకు వినతి పత్రం

రైతులకు యూరియాను యాప్ విధానంలో కాకుండా నేరుగా అందించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం ఆధ్వర్యంలో కూసుమంచి మండల కేంద్రంలో తహసీల్దారుకు వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు బజ్జూరి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు రైతుల ప్రభుత్వం అని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం యూరియాను యాప్ విధానంలో అందించడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చదువు లేని రైతులు, సెల్ ఫోన్ లేని రైతులు కొత్త విధానంతో యూరియాను పొందలేకపోతున్నారని అన్నారు.ఎరువు దుకాణాల వద్దకు వెళ్లిన రైతులకు ముందుగా యాప్‌లో నమోదు చేసుకోవాలని చెప్పి వెనక్కి పంపిస్తున్నారని తెలిపారు. కొందరు దుకాణ యజమానులు రైతుల పేర్లతోనే నమోదు చేసుకుని ఎరువును బ్లాకులో ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయల వరకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. మండలానికి కేటాయించిన యూరియా ఇతర మండలాలకు మళ్లుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు.అందువల్ల యూరియాను యాప్ విధానంలో కాకుండా నేరుగా రైతులకు సరిపడా అందించాలని, ఏ మండలానికి వచ్చిన యూరియాను ఆ మండల రైతులకే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కౌలు రైతులకు కూడా రైతుబంధు అమలు చేయాలని, రైతుల రుణాలను తక్షణమే మాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా నాయకుడు కలకొండ సురేష్, మండల అధ్యక్ష కార్యదర్శులు మాతంగి రామస్వామి, చెరుకుపల్లి వీరయ్య, నాయకులు బత్తుల ఉప్పయ్య, నోముల రంగారావు, నిమ్మల వెంకన్న, కలకొండ కల్పన తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

యూరియాను యాప్ విధానంలో కాకుండా నేరుగా ఇవ్వాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News