Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:33 AM

యూజీసీ నిబంధనలు కుల వివక్షతకు దారితీస్తాయి! డి.హరినాధ్

31-01-2026 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

విస్సన్నపేట జనవరి 31ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేటలో సిపీఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్ మాట్లాడుతూ యూజీసీ తీసుకొచ్చిన కొత్త నిబంధనలపై సుప్రీంకోర్టు స్టే విధించడం పట్ల సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్ హర్షం వ్యక్తం చేశారు. ఉన్నత విద్యాసంస్థల్లో సమానత్వం పెంపొందించేందుకు అంటూ యుజిసి తెచ్చిన విధివిధానాలు ఆస్పష్టంగా ఉన్నాయని కుల వివక్షతను రెచ్చగొట్టే ప్రమాదం ఉందని హరినాథ్ ఆందోళన వ్యక్తం చేశారు.కుల వివక్షత లేని సమాజం కోసం మనం ఏమి సాధించాము మళ్ళీ సమాజాన్ని వెనక్కి తీసుకువెళుతున్నామా అనే భావన సుప్రీంకోర్టు వ్యక్తం చేసిందని హరినాథ్ తెలిపారు. హాస్టల్లో అందరూ కలిసి ఉండే సంస్కృతి మంచిదన్నారు. విద్యాసంస్థల్లో స్వేచ్ఛ సమానత్వ వాతావరణాన్ని నెలకొల్పాలని హరినాథ్ కోరారు. ప్రతి ఉన్నత విద్యాసంస్థలోను సమానత్వ (ఈక్విటీ)కమిటీల ఏర్పాటును యూజీసీ తప్పనిసరి చేసింది. ఆయా కమిటీల్లో ఓ బి సి, ఎస్ సి ,ఎస్ టి దివ్యాంగుల మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలని ఆదేశించింది. రోహిత్ వేముల కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఉన్నత విద్యాసంస్థల్లో సమానత్వ ప్రోత్సాహ నిబంధనలు-2012 స్థానంలో యూ జీసీ కొత్త నిబంధనలను ఈనెల 13 నుంచి అమల్లోకి తెచ్చింది. వీటిలో కుల వివక్ష నిర్వచనాన్ని ఓ బి సి ఎస్ సి ,ఎస్ టి, విద్యార్థులు, అధ్యాపక సిబ్బందికే పరిమితం చేయటం పై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయని హరినాథ్ అన్నారు. కుల వివక్షతకు తావు ఇవ్వని రీతిలో వివక్ష అనే పదాన్ని నిర్వచించేలాయూజీసీ ఆదేశాల్లో మార్పు చేయాలని హరినాథ్ డిమాండ్ చేశారు. లేకుంటే దేశవ్యాప్త నిరసన ఎదుర్కోవాల్సి ఉంటుందని హరినాథ్ హెచ్చరించారు.

Sthanikam

యూజీసీ నిబంధనలు కుల వివక్షతకు దారితీస్తాయి! డి.హరినాధ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News