Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:53 AM

యూరియా కొనుగోలుకు ఆప్ తప్పనిసరి: కూసుమంచి డివిజన్ సహాయ సంచాలకులు సతీష్

28-12-2025 114 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
ఖమ్మం, స్థానిక ప్రతినిధి జనార్ధన్:

యూరియా కొనుగోలుకు ఇకపై ఆన్‌లైన్ బుకింగ్ తప్పనిసరిగా అమలు చేయనున్నట్లు కూసుమంచి డివిజన్ సహాయ సంచాలకులు సతీష్ తెలిపారు. ఈ నెల 29 నుంచి యూరియా అవసరమైన రైతులు తప్పనిసరిగా మొబైల్ ఆప్ ద్వారా బుక్ చేసుకుని మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు.

డీలర్లు సోమవారం నుంచి కేవలం ఆప్‌లో బుక్ చేసుకున్న రైతులకే యూరియాను విక్రయించాలని ఆదేశించినట్లు తెలిపారు. రైతులు తమ ఆండ్రాయిడ్ మొబైల్‌లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఫర్టిలైజర్ బుకింగ్ ఆప్ను డౌన్‌లోడ్ చేసుకుని యూరియాను బుక్ చేసుకోవాలని సూచించారు.

రైతుల భూమి పరిమాణం, సాగు చేసిన పంట వివరాల ఆధారంగా ఆప్ ద్వారా యూరియా కేటాయింపు జరుగుతుందని తెలిపారు. యూరియా కొనుగోలు సమయంలో ఆప్‌లో బుకింగ్ చేసిన తర్వాత వచ్చే బుకింగ్ ఐడి తో పాటు ఆధార్ కార్డు తీసుకురావాలని స్పష్టం చేశారు.

రైతులకు ఆప్ వినియోగంలో సాంకేతిక సహాయం అందించేందుకు వ్యవసాయ శాఖ విస్తరణ అధికారులు, సహకార సంఘాల అధికారులు, డీలర్లు, వాలంటీర్లు అందుబాటులో ఉంటారని తెలిపారు. రైతులు ఎలాంటి సందేహం లేకుండా ఆప్‌ను వినియోగించుకుని సహకరించాలని కోరారు

Sthanikam

యూరియా కొనుగోలుకు ఆప్ తప్పనిసరి: కూసుమంచి డివిజన్ సహాయ సంచాలకులు సతీష్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News