Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:22 AM

యాదగిరిగుట్ట ప్రాథమిక వైద్యశాలని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

20-02-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

యాదగిరిగుట్ట:ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు, సిబ్బంది అందరూ అందుబాటులో ఉండి రోగులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. శుక్రవారం యాదగిరిగుట్ట ప్రాథమిక వైద్యశాలని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ...ఆసుపత్రిలో డాక్టర్,మెడికల్ సిబ్బంది అందరూ వచ్చారా లేదా అని హాజరు రిజిస్టర్ పరిశీలించారు.సిబ్బంది అందరూ సమయపాలన పాటించి రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలన్నారు. ఈరోజు ఓ.పి కి ఎంత మంది వచ్చారని ఆరా తీసి వారు ఏ సమస్య తో వచ్చారని అడిగి తెలుసుకున్నారు. వచ్చిన పేషంట్లలో ఎక్కువగా ఏ సమస్య పై వస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. అవసరైన మందులు అన్ని సరిపోను అందుబాటులో ఉన్నాయ అని అడిగి,అన్ని మందులు అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. గత నెలలో ఆసుపత్రిలో ఎన్ని డెలివరీలు జరిగాయని, అందులో సాధారణ ప్రసవాలు ఎన్ని అయ్యాయని ఆరా తీశారు.ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల టెస్టులు చేస్తున్నారని గర్భిణీలకు అవగాహన కల్పించి ప్రభుత్వ ఆసుపత్రిలోనే డెలివరీలు చేయించుకునేలా చర్యలు చేపట్టాలన్నారు.ఆసుపత్రిలో ఇటీవల నార్మల్ డెలివరీ జరిగిన గర్భిణి స్త్రీ కి కలెక్టర్ స్వయంగా ఫోన్ చేసి పుట్టిన బిడ్డ ఆరోగ్యం ఎలా ఉంది,ఎంత బరువు లో పుట్టారు,ఆసుపత్రి లో డాక్టర్ మరియు సిబ్బంది వైద్య చికిత్సలు అన్ని మంచిగా చేసారా అని అడిగి తెలుసుకున్నారు.అప్పుడు గర్భిణీ ప్రభుత్వ ఆసుపత్రి లో మంచి వైద్య సేవలు అందిస్తున్నారని,ఎలాంటి ఇబ్బందులు కూడా లేవని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

యాదగిరిగుట్ట ప్రాథమిక వైద్యశాలని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News