Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:20 AM

యాదగిరిగుట్ట మండలం రాళ్ల జనగం గ్రామంలో పులి సంచారం–దూడ మృతి

25-01-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

సంఘటన స్థలాన్ని పరిశీలించిన- ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో శ్రీనివాస్

యాదగిరిగుట్ట మండలం రాళ్ల జనగం గ్రామ పరిధిలోని వ్యవసాయ బావి వద్ద పులి సంచారం కలకలం రేపింది. ఈ ఘటనలో పులి దాడి చేసి ఓ దూడను చంపి రక్తం పీల్చివేసినట్లు గ్రామస్తులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బిర్ల అయిలయ్య సంఘటన స్థలాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా బాధిత రైతును ఎమ్మెల్యే ఓదార్చి, ప్రభుత్వం తరఫున అన్ని విధాల సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. అటవీ శాఖ అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.ట్రాప్ కెమెరాల సహాయంతో,డ్రోన్ కెమెరాల సహాయం తో,ప్రత్యేక టీం లను ఏర్పాటు చేసి గుర్తించాలని తెలిపారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని,పశువులను రాత్రి వేళల్లో సురక్షితంగా ఉంచుకోవాలని సూచించారు.చీకటి పడే లోపు గ్రామంలోకి రైతులు చేరుకోవాలన్నారు.పులి సంచారం నేపథ్యంలో గ్రామంలో భయాందోళనలు నెలకొనగా, అటవీ శాఖ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు..

Sthanikam

యాదగిరిగుట్ట మండలం రాళ్ల జనగం గ్రామంలో పులి సంచారం–దూడ మృతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News