Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 08:25 AM

యాదాద్రిశుడికి నిత్య పూజలు స్వామివారి నిత్య రాబడి రూ.29.97 లక్షలు

14-05-2026 57 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దివ్యక్షేత్రంలో గురువారం నిత్య ఆరాధనలు వైభవంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయంలో నిర్వహించిన సువర్ణ పుష్పార్చన, నిత్య కళ్యాణం, వేద ఆశీర్వచనం కార్యక్రమాలు భక్తిశ్రద్ధల మధ్య జరిగాయి. సాయంత్రం నిర్వహించిన వెండి మొక్కు, జోడు సేవలు, కొండకింద సత్యనారాయణస్వామి వ్రతాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

కొండపై ఉన్న అనుబంధ ఆలయమైన శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వరస్వామి వారిని భక్తులు దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. అలాగే పాతగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

స్వామివారి నిత్య రాబడిగా గురువారం రూ.29,97,382 వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. కార్యక్రమాల్లో ఆలయ ఉప ప్రధాన అర్చకులు మాధవాచార్యులు, రాకేష్‌కుమార్ చార్యులు, మురళీకుమార్ చార్యులు, శ్రీనాథ్ చార్యులు, ఇన్‌చార్జి వెంకటేష్, ఎస్పీఎఫ్ ఏఎస్ఐ నాగేశ్వరరావు, సిబ్బంది రాజాగౌడ్, మధు, యాదగిరి, దేవస్థాన సిబ్బంది కొమ్మగాని కుమార్ తదితరులు పాల్గొన్నారు

Sthanikam

యాదాద్రిశుడికి నిత్య పూజలు స్వామివారి నిత్య రాబడి రూ.29.97 లక్షలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News