యాదగిరిగుట్ట,యాదాద్రి కొండపై ఉన్న అనుబంధ దేవాలయం శివాలయంలో శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారికి సోమవారం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి రుద్రాభిషేకం,రుద్రహోమం నిర్వహించి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. అనంతరం పార్వతీ దేవిని కొలుస్తూ ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో అర్చకులు కుంకుమార్చన నిర్వహించారు.ఉదయం నుంచి శివునికి అభిషేక పూజలు నిర్వహించి,వివిధ రకాల పూలతో,బిల్వ పత్రాలతో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య మంగళహారతులు సమర్పించి స్వామివారిని భక్తులకు దర్శనమిచ్చారు.ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
PRINT TIME: October 10, 2026 05:24 AM
యాదాద్రి శివాలయంలో ఘనంగా ఉత్సవ సేవలు
యాదాద్రి శివాలయంలో ఘనంగా ఉత్సవ సేవలు
16-03-2026
26 Views
స్థానికం ప్రతినిధి :
యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter
యాదగిరిగుట్ట,యాదాద్రి కొండపై ఉన్న అనుబంధ దేవాలయం శివాలయంలో శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారికి సోమవారం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి రుద్రాభిషేకం,రుద్రహోమం నిర్వహించి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. అనంతరం పార్వతీ దేవిని కొలుస్తూ ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో అర్చకులు కుంకుమార్చన నిర్వహించారు.ఉదయం నుంచి శివునికి అభిషేక పూజలు నిర్వహించి,వివిధ రకాల పూలతో,బిల్వ పత్రాలతో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య మంగళహారతులు సమర్పించి స్వామివారిని భక్తులకు దర్శనమిచ్చారు.ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి