Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:54 PM

వంద పడకల ఆసుపత్రిని పూర్తి చేయాలి.. కలెక్టర్ కు వినతి

వంద పడకల ఆసుపత్రిని పూర్తి చేయాలి.. కలెక్టర్ కు వినతి

వంద పడకల ఆసుపత్రిని పూర్తి చేయాలి.. కలెక్టర్ కు వినతి
March 16, 2026 06:49 PM 179 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ పట్టణంలోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేసి వైద్యులను నియమించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం పార్టీ చౌటుప్పల్ మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ప్రభుత్వ ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతికి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా సీపీఎం పార్టీ మున్సిపల్ కార్యదర్శి గోశిక కరుణాకర్ మాట్లాడుతూ చౌటుప్పల్ పరిసర ప్రాంతాలకు చెందిన సుమారు ఎనిమిది మండలాల ప్రజలు వైద్య సేవల కోసం చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రిపై ఆధారపడుతున్నారని తెలిపారు. జాతీయ రహదారి ఉండటంతో తరచూ వాహన ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్య సదుపాయాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.హైదరాబాద్‌కు వెళ్లి ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందే స్థోమత లేక అనేక మంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సరైన సమయంలో చికిత్స అందక ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు కూడా జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని గత ప్రభుత్వం రూ.36 కోట్ల వ్యయంతో వంద పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని ప్రారంభించిందన్నారు. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యంతో సంవత్సరాలు గడుస్తున్నా ఆసుపత్రి నిర్మాణం పూర్తి కాక ప్రజలకు అందుబాటులోకి రాలేదని విమర్శించారు.ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి ఆసుపత్రి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి అన్ని రకాల వైద్యులను నియమించి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎండి పాషా, అవ్వారి రామేశ్వరి, చౌటుప్పల్ 16వ వార్డు కౌన్సిలర్ బత్తుల జయమ్మ దాసు, నాయకులు బండారు నరసింహ, బత్తుల దాసు, ఆదిమూలం నందీశ్వర్, ఆకుల ధర్మయ్య, కందగట్ల ఆనంద్, సప్పిడి శ్రీనివాసరెడ్డి, చికూరు ఈదయ, ముగదాల రాములు, ఎండి జానీ, సోమరాజ్, యాదయ్య, పంతంగి సంధ్య, సుర్వి వెంకటేష్, యాదమ్మ, సుర్వి జయమ్మ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News