Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాత్రివేళ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్యం అందాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 10:33 AM

వివేకానంద స్ఫూర్తితో ముందుకు సాగితే విజయాలు సొంతం

12-01-2026 54 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

వివేకానందుడిని యువత ఆదర్శంగా తీసుకోవాలి

వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

స్వామి వివేకానందుడి జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకుని సమసమాజ స్థాపనకు కృషి చేయాలని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. వివేకానంద జయంతిని పురస్కరించుకుని స్థానిక వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా కొప్పుల వేణారెడ్డి మాట్లాడుతూ. స్వామి వివేకానంద జయంతిని యువతలో స్ఫూర్తి నింపే ఉద్దేశంతో 1985 సంవత్సరం నుంచి ప్రతి ఏడాది జనవరి 12న జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నారని గుర్తు చేశారు. నేటి యువత తమలో ఉన్న ప్రతిభను సరిగా గుర్తించుకోలేక కొంతమంది చెడు మార్గాల వైపు అడుగులు వేస్తూ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ధోరణి వల్ల సమాజానికి చేటు కలగడమే కాకుండా తల్లిదండ్రులకు మానసిక క్షోభ మిగులుతుందన్నారు. ప్రతి మనిషిలో మంచి, చెడు రెండూ ఉంటాయని, కుళ్ళిపోయిన ఆహారాన్ని ఎలా త్యజిస్తామో, అదే విధంగా మనలోని చెడు భావనలను విడనాడి మంచి మార్గంలో నడవాలని యువత కంకణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు. అలా చేస్తే సమాజంలో గౌరవం పొందడమే కాకుండా తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొచ్చినవారవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యండి అంజద్ అలి, మార్కెట్ డైరెక్టర్ వుప్పల సత్యనారాయణ, అడ్త్ అసోసియేషన్ అధ్యక్షుడు తూడి విద్యా సాగర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బైరు నాగరాజు, గడ్డం వెంకన్న, పందిరి మల్లేష్ గౌడ్, కనుకు వెంకన్న, ఆదిమల్ల కృష్ణ, ముత్యాల కిషన్, చాగంటి అయ్యన్న, మార్కెట్ కార్యాలయ సూపర్‌వైజర్ ఖాసీం తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వివేకానంద స్ఫూర్తితో ముందుకు సాగితే విజయాలు సొంతం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News