వివాహ వేడుకలో సహాయం అందించి ఆదర్శంగా జిఎంఆర్ ఫౌండేషన్
వివాహ వేడుకలో సహాయం అందించి ఆదర్శంగా జిఎంఆర్ ఫౌండేషన్
Krishna
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మనూర్ మండలం ముగ్దుంపూర్ గ్రామంలో పేద కుటుంబానికి చెందిన దానయ్య కుమారుని వివాహానికి జిఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సహాయం అందించారు. జిఎంఆర్ ఫౌండేషన్ అధ్యక్షుడు, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు గుఱ్ఱపు మచ్చేందర్ ఆదేశాల మేరకు పెళ్లి కుటుంబానికి బియ్యం అందజేసి వారికి ఆర్థికంగా తోడ్పాటు అందించారు. ఈ సహాయంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేయగా గ్రామ ప్రజలు ఫౌండేషన్ సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో జిఎంఆర్ బృంద సభ్యులు, నారాయణఖేడ్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, రుద్రారం మాజీ సర్పంచ్ ప్రభాకర్, నారాయణఖేడ్ మున్సిపల్ నాలుగో వార్డు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ నాయక్, తుకారాం తదితరులు పాల్గొన్నారు. పేదల వివాహాలకు అండగా నిలుస్తూ సమాజంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న జిఎంఆర్ ఫౌండేషన్‌కు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి