Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:26 AM

జూలైలోనే పీఎం కిసాన్ 23వ విడత?.. రైతులకు ఎదురుచూపులు!

21-04-2026 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

దేశవ్యాప్తంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద వచ్చే తదుపరి రూ.2,000 విడత త్వరలోనే రైతుల ఖాతాల్లో జమయ్యే అవకాశం ఉందని సమాచారం.

ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు సంవత్సరానికి రూ.6,000ను మూడు విడతలుగా నేరుగా డీబీటీ ద్వారా కేంద్రం అందిస్తోంది. ఇప్పటికే పలువురు రైతులు గత విడతల ప్రయోజనం పొందగా, ఇప్పుడు 23వ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తాజా అంచనాల ప్రకారం, ఈ 23వ విడత నిధులు జూలై నెలలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఖచ్చితమైన తేదీపై కేంద్రం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.

ఇక, ఈ సాయం పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తి చేయని వారికి డబ్బులు జమ కావు.

రైతులకు ఆర్థికంగా ఊరటనిచ్చే ఈ పథకం తదుపరి విడత ఎప్పుడు వస్తుందోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది.

Sthanikam

జూలైలోనే పీఎం కిసాన్ 23వ విడత?.. రైతులకు ఎదురుచూపులు!

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News