Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 03, 2026 04:15 AM

ఆర్థికంగా బలపడేలా మహిళలకు ప్రభుత్వ ప్రోత్సాహం

09-04-2026 417 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లాలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో బేటి బచావో – బేటి పడావో పథకం కింద ప్రత్యేక కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. మహిళల సాధికారత మరియు ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా 50 మంది లబ్ధిదారులకు కుట్టు యంత్రాలను పంపిణీ చేయగా, మరో 25 మంది మహిళలకు బ్యూటీషియన్ శిక్షణ తరగతులను ప్రారంభించారు.మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి వారి జీవనోపాధిని మెరుగుపరచడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా కొనసాగింది.ఆర్థికంగా వెనుకబడిన మహిళలు, ఒంటరి మహిళలు, వితంతువులు, చదువు మధ్యలో మానేసిన వారు మరియు ఇతర అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా వారిని స్వయం సమృద్ధి దిశగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ కార్యక్రమాన్ని సంగారెడ్డి జిల్లా బాలసదనంలో నిర్వహించగా టీజీఐసీసీ చైర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డి మరియు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ప్రారంభించారు. కార్యక్రమం సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు సంకేతంగా మొక్కల నాటకం కూడా నిర్వహించారు.ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ మహిళల అభివృద్ధికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని, మహిళలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడం లక్ష్యమని తెలిపారు.జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ కుట్టు యంత్రాల పంపిణీ మరియు శిక్షణ కార్యక్రమాల ద్వారా మహిళలు స్వయం ఉపాధి సాధించి తమ కుటుంబ ఆర్థిక స్థితిని మెరుగుపరచుకోవచ్చని అన్నారు. జిల్లా సంక్షేమ అధికారిణి లలితా కుమారి మహిళా శిశు సంక్షేమ శాఖ అమలు చేస్తున్న పథకాల ప్రాముఖ్యతను వివరించి మహిళలు స్వయం ఉపాధి దిశగా ముందుకు సాగాలని సూచించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ వనిత సంతోష్ కూడా మహిళల సాధికారతకు అందరూ సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా సాధికారత కేంద్రం సమన్వయకర్త పల్లవి, సీడీపీఓ చంద్రకళ, జిల్లా బాలల పరిరక్షణ అధికారి రత్నం,బాలసదనం సూపరింటెండెంట్ విజయ, కౌన్సిలర్లు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం ద్వారా మహిళలకు ఉపాధి అవకాశాలు పెంపొందించడమే కాకుండా, సమాజంలో వారికి ఆత్మవిశ్వాసం మరియు గౌరవం పెంపొందించేందుకు దోహదపడుతుందని అధికారులు తెలిపారు.

Sthanikam

ఆర్థికంగా బలపడేలా మహిళలకు ప్రభుత్వ ప్రోత్సాహం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News