Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:17 PM

ఇల్లు గుల్ల చేశాడు.. జైలు పాలయ్యాడు!

ఇల్లు గుల్ల చేశాడు.. జైలు పాలయ్యాడు!

ఇల్లు గుల్ల చేశాడు.. జైలు పాలయ్యాడు!
08-04-2026 447 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఒక్క రోజే రూ.14 లక్షలు మాయం.. నిందితుడి నుంచి కారు, ఐఫోన్లు స్వాధీనం

తాళం వేసి ఉన్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ఒక అంతరాష్ట్ర దొంగను చౌటుప్పల్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి భారీగా నగదుతో పాటు ఒక కారు, సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోలీసులు ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు

​చౌటుప్పల్ పట్టణం కటమయ్య కాలనీకి చెందిన లింగంపల్లి నర్సింహా (డ్రైవర్) గత ఫిబ్రవరి 21న తన కుమార్తెను చూసేందుకు భార్యతో కలిసి హయత్ నగర్‌కు వెళ్లారు. అదే రోజు రాత్రి 10:50 గంటల ప్రాంతంలో తిరిగి వచ్చేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూడగా అల్మారాలోని బట్టలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అల్మారాలో దాచుకున్న రూ. 14,20,000/- నగదు మాయమైనట్లు గుర్తించిన నర్సింహా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ​యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్, అదనపు ఎస్పీ లక్ష్మినారాయణ ఆదేశాల మేరకు, చౌటుప్పల్ డీఎస్పీ మధుసూదన్ రెడ్డి పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్లు మన్మధకుమార్, ప్రవీణ్ బాబు (సీసీస్) ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. సాంకేతిక ఆధారాల సాయంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు, ధర్మోజిగూడెం స్టేజీ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడి వివరాలు:

పట్టుబడిన వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా వేటపాలెంకు చెందిన మిక్కిలి శామ్ రిచర్డ్ అలియాస్ వంశీకృష్ణ (43) గా గుర్తించారు. ఇతడు ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఎల్‌బీ నగర్, మన్సూరాబాద్ రాక్ టౌన్ కాలనీలో నివాసం ఉంటున్నాడు.

స్వాధీనం చేసుకున్న సొత్తు:

​నిందితుడి నుంచి పోలీసులు ఈ క్రింది వస్తువులను స్వాధీనం చేసుకున్నారు:

​నగదు: రూ. 7,00,000/- (నగదు రూపంలో). నిందితుడి ఖాతాలో వేసుకున్న రూ. 2.10 లక్షలు (ఫ్రీజ్ చేయబడింది). హ్యుందాయ్ ఎక్స్టర్ కారు (TS 08 JW 1575).

​ఐఫోన్ 16 ప్రో మాక్స్, ఒప్పో ఎఫ్ 25 ప్రో మొబైల్, హెచ్‌పీ ల్యాప్‌టాప్.​కెమెరా: కెనాన్ ఈవోఎస్ రెబెల్ జే6 (జూమ్ లెన్స్‌తో సహా).​ఈ కేసును అత్యంత వేగంగా ఛేదించిన ఇన్‌స్పెక్టర్లు మన్మధకుమార్, ప్రవీణ్ బాబు, ఎస్సైలు యాదగిరి, సైదులు, కుమారస్వామి, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లను ఉన్నతాధికారులు అభినందించారు.

Sthanikam

ఇల్లు గుల్ల చేశాడు.. జైలు పాలయ్యాడు!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News