Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:08 PM

భీమారం గ్రామంలో దారుణ హత్య – గొర్రెల కాపరి జానయ్యను బండరాయితో మోది హతం

11-04-2026 399 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్లగొండ జిల్లాలోని కేతపల్లి మండలం భీమారం గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కలంచెర్ల జానయ్య (50) అనే వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు రాత్రి వేళ అత్యంత క్రూరంగా హత్య చేశారు. బాధితుడు యాదవ కులానికి చెందినవాడు కాగా, రోజువారీగా తన గొర్రెలను కాపాడుతూ జీవనం సాగించేవాడు.స్థానికుల సమాచారం మేరకు, జానయ్య ప్రతి రోజు లాగే గొర్రెలను కాపాడుకుని వచ్చి దొడ్డిలో ఉంచి అక్కడే నిద్రించేవాడు. ఈ క్రమంలోనే రాత్రి సమయంలో ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు అతని తలపై బండరాయితో మోది హతమార్చినట్లు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.అత్యంత విచిత్రమైన విషయం ఏమిటంటే, మృతుడిపై ఉన్న బంగారం, వెండి మరియు ఇతర విలువైన వస్తువులు ఏవీ దుండగులు అపహరించలేదు. దీంతో ఈ హత్య వెనుక వ్యక్తిగత విభేదాలు లేదా ఇతర కారణాలు ఉన్నాయేమోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Sthanikam

భీమారం గ్రామంలో దారుణ హత్య – గొర్రెల కాపరి జానయ్యను బండరాయితో మోది హతం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News