Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:26 AM

విస్తరణ పూర్తి చేయాలి. సీపీఎం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ.

08-06-2026 25 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట పట్టణంలోని సుభాష్ సెంటర్ నుంచి మల్లికార్జున రైస్‌మిల్ వరకు రోడ్డు విస్తరణ పనులను పూర్తి చేసి, పట్టణ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం రామన్నపేట పట్టణ శాఖ ఆధ్వర్యంలో సోమవారం సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శివర్గ సభ్యుడు కందుల హనుమంతు, పట్టణ కార్యదర్శి మునికుంట్ల లెనిన్ మాట్లాడుతూ ఒకప్పుడు తాలూకా, నియోజకవర్గ కేంద్రంగా వెలుగొందిన రామన్నపేట నేడు అభివృద్ధికి ఆమడదూరంలో ఉందన్నారు. గ్రామపంచాయతీ హోదా ఉన్నప్పటికీ మౌలిక వసతుల అభివృద్ధిలో వెనుకబడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఊరు విడిచి వెళ్లిన ప్రజలు తిరిగి వచ్చినప్పుడు దశాబ్దాల క్రితం ఉన్న పరిస్థితులే కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.

పట్టణంలో రహదారులు, డ్రైనేజీలు, తాగునీటి సదుపాయాలు సరిగా లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రధాన రహదారిగా ఉన్న సుభాష్ రోడ్ ఇరుకుగా మారడంతో ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, భారీ వాహనాలు వచ్చినప్పుడు ద్విచక్ర వాహనదారులు, పాదచారులు పక్కకు తప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. పార్కింగ్ స్థలాల లేమితో వాహనాలు రోడ్డుపైనే నిలిపివేయడం వల్ల ప్రమాదాల ముప్పు పెరుగుతోందని పేర్కొన్నారు.

గత పాలకులు రోడ్డు విస్తరణ హామీ ఇచ్చి అసంపూర్తిగా వదిలేశారని, ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా సమస్య పరిష్కారంపై దృష్టి సారించలేదని విమర్శించారు. పట్టణంలోని ప్రధాన సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి తగిన నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో సీపీఎం నాయకులు గాదె నరేందర్, గొరిగే సోములు, ఆముద ఆంజనేయులు, అప్పం సంతోష్, బావండ్లపల్లి సత్యం, తరిగొప్పుల వెంకటరెడ్డి, గంజి అశోక్, పల్లె సత్యం, బోళ్ల వెంకన్న, కుందూరు వెంకటేశ్వర్లు, రాసాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

విస్తరణ పూర్తి చేయాలి. సీపీఎం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ.

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News