Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:39 AM

విస్సన్నపేటలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్

27-01-2026 87 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో జరిగిన రిపబ్లిక్ డే దినోత్సవాల్లో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్ ప్రసంగిస్తూ స్వాతంత్ర ఫలాలు రాజ్యాంగ స్ఫూర్తి బడుగు బలహీన వర్గాలకు 77 ఏళ్లయినా చేరువు కాలేదని మోడీ పాలనలో ఆదానీ అంబానీలు ప్రపంచ కుబేరుల్లో మొదటి స్థానం సంపాదించగలిగారు కానీ పేదవాడు మరింత పేదవాడుగా మారిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ జెండాను అంగీకరించని ఆర్ఎస్ఎస్ శక్తులు వందేమాతర గీతాన్ని కూడా వివాదం చేశారన్నారు. ఎన్డీఏ పాలనలో భారత రాజ్యాంగాన్ని కూడా మార్చాలని మనువాద రాజ్యాంగం తీసుకురావాలని కన్న పగటి కలలు 2024 ఎన్నికల్లో నెరవేర లేదన్నారు. అంబేద్కర్ చెప్పినట్లు రాజ్యాంగం ఎంత మంచిదైనా అమలు చేసేవారిలో చిత్తశుద్ధి లేకపోతే ప్రయోజనం లేదని ఆనాడే చెప్పారని హరినాథ్ గుర్తు చేశారు. రాజ్యాంగం నుండి సామ్యవాదం లౌకిక అంశాలను తొలగించి హిందుత్వ మనువాద అంశాలను జోడించాలని బిజెపి ఎన్ డి ఏ ప్రయత్నిస్తోందని హరినాథ్ ఆరోపించారు. గ్రామీణ పేదలకు జీవనోపాధి కలిగించే మహాత్మా గాంధీ జాతియ ఉపాధి హామీ చట్టాన్ని పథకంగా రూపొందించి రాంజీ పథకంగా మార్పుచేసి కేంద్ర నిధుల్లో కోత పెట్టి రాష్ట్రాల నెత్తిన 40% ఆర్థికభారం వేసిందన్నారు. పబ్లిక్ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టి దేశంలో నిరుద్యోగం సృష్టించిందని హరినాథ్ అన్నారు. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ రాజ్యమేలుతోందని, ఉన్నావ్ అత్యాచార రేపిస్టులకు ఫెరోళ్లు మంజూరు చేస్తూ విప్లవకారులను ప్రజాస్వామిక వాదులను ఏళ్ల తరబడి విచారణ లేకుండా జైలు పాలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణకుమారి మౌళి జోషి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

విస్సన్నపేటలో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News