Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:16 AM

విస్సన్నపేటలో అతివేగం కారు హల్‌చల్ – ఇద్దరు అదుపులో

22-02-2026 145 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ప్రజల ప్రాణాలకు ముప్పు… సాహసంగా వెంబడించి నిందితుల పట్టివేత

అప్రమత్తమైన పోలీసులు – ప్రమాదకర డ్రైవింగ్‌కు చెక్

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గ పరిధిలో అతివేగంగా కారు నడిపి ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

విస్సన్నపేట మండల పరిధిలో రహదారిపై ఓ కారు ప్రమాదకరంగా దూసుకెళ్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందని సమాచారం అందడంతో, విస్సన్నపేట పోలీస్ స్టేషన్ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు.

ఈ క్రమంలో కానిస్టేబుళ్లు షేక్ రియాజ్, నాగేశ్వరావు సాహసోపేతంగా వాహనాన్ని వెంబడించారు. ప్రమాదాన్ని లెక్కచేయకుండా చాకచక్యంగా కారును నిలిపివేసి, అందులో ప్రయాణిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

తదుపరి వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనను చూసిన స్థానికులు, రహదారి వెంట ప్రయాణిస్తున్న వాహనదారులు పోలీసుల తక్షణ స్పందనను అభినందించారు.

ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా పనిచేస్తున్నారని అధికారులు పేర్కొన్నారు.

Sthanikam

విస్సన్నపేటలో అతివేగం కారు హల్‌చల్ – ఇద్దరు అదుపులో

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News