Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యార్థుల ప్రాథమిక నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: జిల్లా కలెక్టర్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 11:59 PM

వినియోగదారుల మన్ననలు పొందితేనే వ్యాపార విజయం

18-02-2026 44 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

జాయ్ పెయింట్స్ దుకాణాన్ని ప్రారంభించిన కౌన్సిలర్ భూక్య జ్యోతి లింగ నాయక్

సూర్యాపేట:

వ్యాపారంలో రాణించాలంటే వినియోగదారుల మన్ననలు పొందడం అత్యంత ముఖ్యమని 4వ వార్డు కౌన్సిలర్ భూక్య జ్యోతి లింగ నాయక్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని 18వ వార్డు సుందరయ్య నగర్‌లో జాయ్ పెయింట్స్ దుకాణాన్ని ఆమె ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ వినియోగదారులకు విశ్వసనీయ సేవలు అందిస్తే వ్యాపారం అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. స్థానిక యువకులు స్వయం ఉపాధి ద్వారా ఎదగడం అభినందనీయమని తెలిపారు.దుకాణ నిర్వాహకులు బానోత్ సురేష్ నాయక్, శ్రవణ్ నాయక్ మాట్లాడుతూ తమ వద్ద గృహాలు, వ్యాపార సముదాయాలు, ఇతర వాణిజ్య సంస్థలకు అవసరమైన అన్ని రకాల రంగులు, పెయింటింగ్ సామగ్రి లభిస్తాయని తెలిపారు. వినియోగదారులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగేష్, ఉపేందర్, మహేష్, సుధాకర్, పుల్య, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వినియోగదారుల మన్ననలు పొందితేనే వ్యాపార విజయం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News