Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 06:31 AM

విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందించాలి..

01-06-2026 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

గ్రామీణ ప్రాంత విద్యార్థులకు తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్య అందించి ఉన్నత శిఖరాలను అధిరోహించేలావిద్యాసంస్థలు కృషి చేయాలని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి అన్నారు.సోమవారం

కోదాడలోని చిన్నారి విద్యాపీఠ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థుల్లో కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు విద్యా వ్యవస్థలోని లోపాలను సరిదిద్దడమే లక్ష్యంగా చిన్నారి విద్యాపీఠాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు జానకిరామయ్య, కరస్పాండెంట్ హర్షిత్ వర్మ తెలిపారు.ప్రారంభ దశలో 200 మంది విద్యార్థులతో పాఠశాలనుప్రారంభిస్తున్నామని, ఆంగ్ల భాషా ప్రావీణ్యం పెంపొందించేందుకు మణిపూర్, అస్సాం రాష్ట్రాల నుంచి 50 శాతం మంది ఉపాధ్యాయులను నియమించినట్లు వెల్లడించారు. హాస్టల్‌లో చేరే ప్రతి విద్యార్థికి అవసరమైన వ్యక్తిగత వస్తువులను స్కూల్ ఫీజులోనే అందించనున్నట్లు తెలిపారు.ఆరున్నర ఎకరాల విస్తీర్ణంలో విశాలమైన ఆటస్థలం, పార్కింగ్, పూర్తి స్థాయి వెంటిలేషన్‌తో పాఠశాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి పోషకాహారాన్ని అందించనున్నట్లు పేర్కొన్నారు. సంప్రదాయ 45 నిమిషాల పీరియడ్‌కు బదులుగా గంటన్నర తరగతి సమయాన్ని కేటాయించి విద్యార్థుల భాగస్వామ్యం, కమ్యూనికేషన్ నైపుణ్యాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు హర్షిత్ వర్మ తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు, చిలుకూరు సర్పంచ్ కొల్లు పుల్లమ్మ నాగయ్య,కోదాడ మున్సిపల్ చైర్మన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం, వైస్ చైర్మన్ దేవరపల్లి మల్లీశ్వరి, టీపీసీసీ డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, వివిధ విద్యాసంస్థల చైర్మన్లు, కరస్పాండెంట్లు, ప్రిన్సిపల్స్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందించాలి..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News