Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యా ప్రగతికి నిదర్శనంగా మహిళా డిగ్రీ కళాశాల సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:40 AM

వికసిత్ భారత్ అదిష్టాన్ బిల్లు -2025 వెనక్కి తీసుకోవాలి.

వికసిత్ భారత్ అదిష్టాన్ బిల్లు -2025 వెనక్కి తీసుకోవాలి.

వికసిత్ భారత్ అదిష్టాన్ బిల్లు -2025 వెనక్కి తీసుకోవాలి.
January 12, 2026 11:52 AM 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

విద్యాకేంద్రీకరణ చేస్తూ పేదలకు విద్య దూరం చేసేలా మోదీ విధానాలు.

తెలంగాణ రాష్ట్రంలో జాతీయ విద్యావిధానం అమలు చేయకుండా అసెంబ్లీలో తీర్మానం చేయాలి.

విద్యాశాఖకు మంత్రిని కేటాయించాలి.

ఎస్ఎఫ్ఐ కేంద్ర కమిటీ సభ్యులు మమత

దేశంలో వికసిత్ భారత్ శిక్షా అదిష్టాన్ బిల్లు

2025 వెనక్కి తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ కేంద్ర కమిటీ సభ్యులు మమత డిమాండ్ చేశారు.

స్థానికం యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్

యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో స్థానిక సుందరయ్య భవన్ లో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు ఈర్ల రాహుల్ అధ్యక్షత జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మమత మాట్లాడుతూ... దేశంలో మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యను పేద దళిత,గిరిజన, ఆదివాసీలకు చదువును దూరంచేసేందుకు జాతీయ విద్యావిధానం తీసుకుని వచ్చారని తెలిపారు. ఎన్ఈపి పేరుతో దేశంలో 1 లక్ష పాఠశాలలు మూసివేసి, 2.80 లక్షల టీచర్ పోస్టులను నింపకుండా పాఠశాల విద్యను ప్రైవేటు పరం చేసేందుకు చర్యలు తీసుకుంటుందని అన్నారు. విద్యలో కార్పోరేటీకరణ, వ్యాపారీకరణ,కేంద్రీకరణ విధానాలు అమలు చేస్తోందని విమర్శించారు. ఉన్నత విద్యలో వికసిత్ భారత్ శిక్షా అదిష్టాన్ బిల్లు పేరుతో విద్యా కేంద్రికరణ కోసం రాష్ట్రల హక్కులు కాలరాసి రాష్ర్టాలతో కనీసం సంప్రదింపులు చేయకుండా వారి హక్కులు లాక్కుంది అని విమర్శించారు.ఈ బిల్లు అంశాలను చూస్తే విద్యరంగం అంతా ఒకే గోడుగు క్రిందకు తెచ్చి UGC,NCRT,AICTE సంస్థలను రద్దు చేసి HECI ఏర్పాటు చేసి కేంద్రీకరణ చేయడమే లక్ష్యంగా ఉందన్నారు. ఈ బిల్లు వెంటనే వెనక్కి తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో జాతీయ విద్యా విధానం అమలు చేయకుండా అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని నియామించాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి లావుడియ రాజు మాట్లాడుతూ జిల్లాలో ఎన్నో యేండ్ల కళ్ళ భువనగిరి పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల చౌటుప్పల్ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి, మోట కొండూరు,తుర్కపల్లి మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని, జిల్లాలో ఉన్నటువంటి గురుకులాలకు సొంతభవనం నిర్మించాలని, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సంక్షేమ పూర్తిగా శిథిలా వ్యవస్థలో ఉన్నాయి వాటికి నూతన భవనాలను ఏర్పాటు చేయాలని సంక్షేమ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకు మిస్ కాస్మోటిక్ చార్జీలు విడుదల చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తారని అన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వేముల నాగరాజు,శ్రీనివాస్,జగన్,ఇందు రాణి,ఉదయ్,జిల్లా కమిటీ సభ్యులు కార్తీక్,నరేందర్,నేహాల్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News