Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 08:20 AM

వికలాంగుల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలి

16-05-2026 222 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదగిరిగుట్టలో ఈనెల 29 నుంచి శిక్షణ తరగతులు

బొమ్మలరామారం: వికలాంగుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 29, 30, 31 తేదీలలో యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో నిర్వహించే రాష్ట్ర శిక్షణ తరగతులు, రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని ఎన్‌పీఆర్‌డీ జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ పిలుపునిచ్చారు.

బొమ్మలరామారం మండలంలోని చౌదరిపల్లి, లక్ష్మీ తండా, చికాడిమామిడి గ్రామాల్లో నిర్వహించిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. మండలంలో వికలాంగులకు సదరం సర్టిఫికెట్లు వచ్చినా మూడేళ్లు గడిచినా పెన్షన్లు మంజూరు కావడం లేదన్నారు. యూడీఐడీ కార్డులు వెంటనే అందించడంతో పాటు కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

వికలాంగులకు ఇంద్రమ్మ ఇళ్లు ఇవ్వడం లేదని, ఉపాధి హామీ పథకంలో పనులు కూడా కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మాదిరిగా 150 రోజుల పని కల్పించి రోజుకు రూ.600 కూలి చెల్లించాలని కోరారు.

రాష్ట్ర సదస్సులో వికలాంగుల హక్కుల కోసం చేపట్టాల్సిన పోరాట కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని 17 మండలాల నుంచి పెద్ద సంఖ్యలో పాల్గొని సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో కొత్త లలిత, టీ. జాంగిర్, నమూనా బాలరాజు, టీ. రవి, మైలారం బిక్షపతి, పుట్ట అనూష, పిట్ట కొండల్, ధీరావత్ నరసింహ, ధీరావత్ రాజేందర్, ధీరావత్ రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వికలాంగుల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News