Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:18 AM

వికలాంగుల పెన్షన్‌ను రూ.6 వేలకు పెంచాలి NPRD రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్

07-05-2026 100 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి:

వికలాంగుల పెన్షన్‌ను రూ.6 వేలుకు పెంచి, కొత్త పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పీఆర్‌డీ) రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మే 1 నుంచి 10 వరకు రాష్ట్రవ్యాప్తంగా వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిర్వహిస్తున్న సర్వేలో భాగంగా యాదగిరిగుట్ట మండలం చిన్నకందుకూరు, పెద్దకందుకూరు గ్రామాల్లో గురువారం సర్వే నిర్వహించారు.

ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ గ్రామాల్లో సదరం సర్టిఫికెట్‌, యూడీఐడీ కార్డులు ఉన్నప్పటికీ గత ఐదేళ్లుగా పెన్షన్ కోసం ఎదురుచూస్తున్నామని పలువురు వికలాంగులు ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. ఉపాధి అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

ప్రతి వికలాంగ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వికలాంగులకు రూ.6 వేల పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చి రెండున్నరేళ్లు గడిచినా అమలు చేయకపోవడం బాధాకరమన్నారు.

ఎన్‌పీఆర్‌డీ జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ మాట్లాడుతూ గ్రామాల్లో వికలాంగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి కొత్త లలిత, చిన్నకందుకూరు గ్రామ అధ్యక్షుడు ఎర్ర సుధాకర్, కార్యదర్శి ఎర్ర శ్రీనివాసులు, పెద్దకందుకూరు గ్రామ అధ్యక్షుడు కొమ్మగోని రవి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వికలాంగుల పెన్షన్‌ను రూ.6 వేలకు పెంచాలి NPRD రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News