Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:47 PM

వికలాంగుల హామీలు అమలు చేయకపోతే ప్రభుత్వం పై ఉద్యమం ఉధృతం

వికలాంగుల హామీలు అమలు చేయకపోతే ప్రభుత్వం పై ఉద్యమం ఉధృతం

వికలాంగుల హామీలు అమలు చేయకపోతే ప్రభుత్వం పై ఉద్యమం ఉధృతం
March 26, 2026 08:24 PM 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఇందిరా పార్క్ వద్ద రిలే నిరాహార దీక్ష – గిద్దె రాజేష్ హెచ్చరిక

అసెంబ్లీ ఎన్నికల సమయంలో వికలాంగులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని, లేనిపక్షంలో ప్రభుత్వం పై ఉద్యమాన్ని ఉధృతం చేసి గద్దె దించడమే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తామని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ తెలిపారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ మేనిఫెస్టో సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన రిలే నిరాహార దీక్షలో పాల్గొని ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ వికలాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ముఖ్యంగా వికలాంగుల నెలవారీ పింఛన్‌ను ఆరు వేల రూపాయలకు, తీవ్రమైన వైకల్యం ఉన్నవారికి పదిహేను వేల రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. వికలాంగుల హక్కుల చట్టాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసి, సంబంధిత కమిటీలను ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.

ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు పూర్తి స్థాయి విద్య అందించేందుకు ప్రత్యేక శిక్షణ పొందిన ఉపాధ్యాయులను నియమించాలని, అర్హత సాధించిన వారికి వెంటనే ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలని కోరారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా వికలాంగుల సంక్షేమానికి ప్రత్యేక కార్యాలయాలు ఏర్పాటు చేయాలని అన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా వికలాంగులను ఏకం చేసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని గిద్దె రాజేష్ హెచ్చరించారు. ఈ దీక్షలో పలు సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులు, నాయకులు హాజరై మద్దతు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News