Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 09:30 AM

వికలాంగుల హక్కుల కోసం శిక్షణా తరగతులు ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర స్థాయి పోస్టర్ ఆవిష్కరణ

19-05-2026 74 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదగిరిగుట్ట: వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పీఆర్‌డీ) ఆధ్వర్యంలో ఈ నెల 29 నుంచి 31 వరకు యాదగిరిగుట్టలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతుల పోస్టర్‌ను ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర అధ్యక్షుడు కురునెల్లి వెంకట్ మాట్లాడుతూ.. వికలాంగుల హక్కుల సాధన, వారి సంక్షేమం కోసం నాయకత్వ పటిమను పెంపొందించే లక్ష్యంతో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే ప్రతినిధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మూడు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

వికలాంగుల సమస్యల పరిష్కారం, హక్కుల రక్షణ కోసం సంఘం నిరంతరం పోరాడుతుందని ఆయన పేర్కొన్నారు.కార్యక్రమంలో ఎన్‌పీఆర్‌డీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు సురుపంగ ప్రకాష్, జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లెపల్లి స్వామి, కోశాధికారి కొత్త లలిత, నాయకులు పాండాల శ్రీహరి, నరేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వికలాంగుల హక్కుల కోసం శిక్షణా తరగతులు ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర స్థాయి పోస్టర్ ఆవిష్కరణ

Article Image

యాదగిరిగుట్ట: వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పీఆర్‌డీ) ఆధ్వర్యంలో ఈ నెల 29 నుంచి 31 వరకు యాదగిరిగుట్టలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతుల పోస్టర్‌ను ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర అధ్యక్షుడు కురునెల్లి వెంకట్ మాట్లాడుతూ.. వికలాంగుల హక్కుల సాధన, వారి సంక్షేమం కోసం నాయకత్వ పటిమను పెంపొందించే లక్ష్యంతో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే ప్రతినిధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మూడు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

వికలాంగుల సమస్యల పరిష్కారం, హక్కుల రక్షణ కోసం సంఘం నిరంతరం పోరాడుతుందని ఆయన పేర్కొన్నారు.కార్యక్రమంలో ఎన్‌పీఆర్‌డీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు సురుపంగ ప్రకాష్, జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లెపల్లి స్వామి, కోశాధికారి కొత్త లలిత, నాయకులు పాండాల శ్రీహరి, నరేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News