Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాత్రివేళ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్యం అందాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 01:45 PM

విధుల్లో ఉన్న కానిస్టేబుల్ దుర్మరణం

విధుల్లో ఉన్న కానిస్టేబుల్ దుర్మరణం

విధుల్లో ఉన్న కానిస్టేబుల్ దుర్మరణం
13-01-2026 105 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

గుర్తుతెలియని వాహనం ఢీతో ప్రాణాలు కోల్పోయిన కోల నరేష్

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

విధుల్లో ఉన్న కానిస్టేబుల్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ధర్మోజీగూడెం వద్ద బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందాడు. మునగాల మండలం తాడ్వాయి గ్రామం (సూర్యాపేట జిల్లా) కు చెందిన కొల నరేష్ (PC–184), తండ్రి రామనరసయ్య, చౌటుప్పల్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. విధుల నిమిత్తం ప్రయాణిస్తుండగా తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న చౌటుప్పల్ సీఐ మన్మధ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, మృతదేహాన్ని చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు.

కానిస్టేబుల్ నరేష్ అకాల మరణం పట్ల కుటుంబ సభ్యులు, సహోద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. కుటుంబానికి ఇది తీరని లోటుగా మారిందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. కానిస్టేబుల్ నరేష్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఈ దుఃఖాన్ని తట్టుకునే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని పలువురు ప్రార్థించారు..

Sthanikam

విధుల్లో ఉన్న కానిస్టేబుల్ దుర్మరణం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News