విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు : కలెక్టర్ అనురాగ్ జయంతి. ఆత్మకూరు పీహెచ్‌సీని తనిఖీ చేసిన కలెక్టర్
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు : కలెక్టర్ అనురాగ్ జయంతి. ఆత్మకూరు పీహెచ్‌సీని తనిఖీ చేసిన కలెక్టర్
Editor Desk
ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన వైద్య సేవలు అందేలా వైద్యులు, సిబ్బంది బాధ్యతతో విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
శుక్రవారం ఆత్మకూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)ను కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రోజువారీ ఓపీకి ఎంతమంది రోగులు వస్తున్నారో, వారికి అందుతున్న వైద్య సదుపాయాలపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
పీహెచ్‌సీలో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది అందరూ క్రమం తప్పకుండా విధులకు హాజరవుతున్నారా లేదా అనే వివరాలను పరిశీలించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఎలాంటి అలసత్వం ఉండకూడదని స్పష్టం చేశారు.
ఆసుపత్రిలో రోగులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించిన కలెక్టర్, సేవలను మరింత మెరుగుపరచడానికి అవసరమైన ఏర్పాట్లపై వైద్యాధికారులతో చర్చించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న రోగుల ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకుని, వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు.
ఈ నెలలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఎన్ని ప్రసవాలు జరిగాయో, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎన్ని డెలివరీలు నమోదయ్యాయో అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగేలా వైద్య సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. గర్భిణులకు నాణ్యమైన వైద్య సేవలు అందించి, ప్రభుత్వ దవాఖానలపై ప్రజల్లో విశ్వాసం పెంచాలని అన్నారు.
షుగర్, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ఎన్‌సీడీ రోగుల ఫాలోఅప్‌పై కూడా కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి రోగులను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన వైద్య సేవలు అందించాలని సూచించారు.
ప్రతి నెల పీహెచ్‌సీల పనితీరుపై సమీక్ష నిర్వహించి, సిబ్బంది పనితీరుకు రేటింగ్ ఇవ్వనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత వైద్య సిబ్బందిపైనే ఉందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి మనోహర్, వైద్యులు, సిబ్బంది, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి