Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:20 AM

విధి నిర్వహణలో మృతి చెందిన హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి రూ.1.35 లక్షల ఆర్థిక భరోసా

23-02-2026 79 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా ఎస్పీ కే. ప్రతాప్ శివ కిషోర్ చేతుల మీదుగా చెక్కు అందజేత

గోపాలపురంలో విధి నిర్వహణలో ఉండగానే ఆకస్మికంగా మృతి చెందిన పోలీసు సిబ్బంది కుటుంబానికి పోలీస్ శాఖ ఆర్థిక సహాయం అందించింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేసిన డి. మధుసూధన్ గత సంవత్సరం జనవరి 26న అకస్మికంగా కన్నుమూశారు. ఆయన మరణం శాఖకు తీరని లోటుగా అధికారులు పేర్కొన్నారు.

సోమవారం ఏలూరు జిల్లా పోలీస్ అధికారి కే. ప్రతాప్ శివ కిషోర్ చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలీస్ ఉద్యోగుల సహకార సంఘం ఆధ్వర్యంలో అందవలసిన ప్రయోజనాలను అందిస్తూ రూ.1,35,661 మొత్తానికి చెందిన చెక్కును మధుసూధన్ సతీమణి సంధ్యకు అందించారు.

ఈ మొత్తంలో ఉద్యోగి షేర్ మూలధనం, పొదుపు నిధి జమలు, వాటిపై వచ్చిన వడ్డీ మొత్తం కలిపి చెల్లించినట్లు పశ్చిమ గోదావరి జిల్లా పోలీస్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీ ప్రతినిధులు వివరించారు. చెల్లింపులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా నిర్వహించబడ్డాయి.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, విధి పట్ల నిబద్ధతతో పనిచేసిన పోలీసు సిబ్బంది అకాల మరణం బాధాకరమని తెలిపారు. కుటుంబానికి శాఖ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, పోలీస్ ఉద్యోగుల సహకార సంఘం ఎల్లప్పుడూ సభ్యుల కుటుంబాలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

కార్యక్రమంలో సహకార సంఘం కార్యదర్శి శ్రీనివాసరావు, అకౌంటెంట్ అబ్దుల్ అలీమ్, ఇతర ప్రతినిధులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Sthanikam

విధి నిర్వహణలో మృతి చెందిన హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి రూ.1.35 లక్షల ఆర్థిక భరోసా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News