Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 09:26 AM

వేటకు విరామం.. మత్స్యకారులకు రూ.20 వేల భరోసా

19-05-2026 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

1.30 లక్షల కుటుంబాలకు రూ.262 కోట్లు జమ

కావలిలో సీఎం చంద్రబాబు నిధుల విడుదల

అమరావతి: వేట నిషేధ కాలంలో మత్స్యకార కుటుంబాలకు ప్రజా ప్రభుత్వం అండగా నిలిచింది. ‘మత్స్యకారుల సేవలో’ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 1,30,796 కుటుంబాలకు రూ.262 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపెంటలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిధులను విడుదల చేశారు.

ప్రతి ఏడాది ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 14 వరకు సముద్ర వేట నిషేధం అమల్లో ఉండటంతో ఉపాధి కోల్పోయే మత్స్యకారులను ఆదుకునేందుకు కుటుంబానికి రూ.20 వేల చొప్పున ప్రభుత్వం సాయం అందిస్తోంది. వరుసగా రెండో ఏడాది ఈ సాయం అందించడం విశేషం.

ఏపీ బెస్త సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ బెస్త రామాంజనేయులు మాట్లాడుతూ.. ఎన్నికల హామీ మేరకు కూటమి ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. గతేడాది 1.21 లక్షల కుటుంబాలకు రూ.243 కోట్లు, ఈ ఏడాది 1.30 లక్షల కుటుంబాలకు రూ.262 కోట్లు అందించిందని తెలిపారు. రెండేళ్లలో మొత్తం రూ.505 కోట్ల సాయం చేసినట్లు వెల్లడించారు.

వేట సమయంలో ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు కూడా ప్రభుత్వం సకాలంలో పరిహారం అందిస్తోందన్నారు. 2024-25లో 63 క్లెయిమ్స్‌కు రూ.3.15 కోట్లు, 2025-26లో 113 క్లెయిమ్స్‌కు రూ.5.65 కోట్లు చెల్లించినట్లు పేర్కొన్నారు. మత్స్యకారుల ఆదాయం పెంచేందుకు సీవీడ్ సాగును కూడా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.

Sthanikam

వేటకు విరామం.. మత్స్యకారులకు రూ.20 వేల భరోసా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News