Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:21 AM

వేసవిలో త్రాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే రోషన్ కుమార్

19-02-2026 40 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చింతలపూడి : రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని జంగారెడ్డిగూడెం మరియు చింతలపూడి మున్సిపాలిటీల్లో త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే రోషన్ కుమార్ కోరారు.

బుధవారం ఆయన ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (AP CRDA) కార్యాలయంలో మున్సిపల్ డైరెక్టర్ సంపత్ కుమార్ ను కలసి పలు అంశాలపై చర్చించారు.

రెండు మున్సిపాలిటీల పరిధిలో పారిశుద్ధ్యం, మురుగు మరియు నీటిపారుదల వ్యవస్థలను మెరుగుపరచేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని ఎమ్మెల్యే సూచించారు. వర్షాకాలం, వేసవి కాలాల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా డ్రైనేజీ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

అదేవిధంగా చింతలపూడి నగర పంచాయతీలో వార్డు సచివాలయ సిబ్బంది కేటాయింపుల విషయంలో స్పష్టత తీసుకువచ్చి, అవసరమైన సిబ్బందిని నియమించి ప్రజలకు సేవలు వేగవంతంగా అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ప్రజలకు మౌలిక వసతులు మెరుగుపరచడం ప్రభుత్వ ప్రాధాన్యతగా తీసుకుని అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు.

Sthanikam

వేసవిలో త్రాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే రోషన్ కుమార్

Article Image

చింతలపూడి : రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని జంగారెడ్డిగూడెం మరియు చింతలపూడి మున్సిపాలిటీల్లో త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే రోషన్ కుమార్ కోరారు.

బుధవారం ఆయన ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (AP CRDA) కార్యాలయంలో మున్సిపల్ డైరెక్టర్ సంపత్ కుమార్ ను కలసి పలు అంశాలపై చర్చించారు.

రెండు మున్సిపాలిటీల పరిధిలో పారిశుద్ధ్యం, మురుగు మరియు నీటిపారుదల వ్యవస్థలను మెరుగుపరచేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని ఎమ్మెల్యే సూచించారు. వర్షాకాలం, వేసవి కాలాల్లో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా డ్రైనేజీ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

అదేవిధంగా చింతలపూడి నగర పంచాయతీలో వార్డు సచివాలయ సిబ్బంది కేటాయింపుల విషయంలో స్పష్టత తీసుకువచ్చి, అవసరమైన సిబ్బందిని నియమించి ప్రజలకు సేవలు వేగవంతంగా అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ప్రజలకు మౌలిక వసతులు మెరుగుపరచడం ప్రభుత్వ ప్రాధాన్యతగా తీసుకుని అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News