Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:09 PM

వేసవిలో దొంగతనాలకు చెక్… పోలీసుల హెచ్చరిక

31-03-2026 245 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఇళ్లకు తాళాలు వేయకపోతే ప్రమాదం ప్రతి ఇంటికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచన

చౌటుప్పల్ మండల పరిధిలోని పట్టణ, గ్రామాల ప్రజలకు స్థానిక పోలీసులు హెచ్చరిక జారీ చేశారు. వేసవి కాలంలో చాలా మంది ప్రజలు ఇళ్ల డాబాలపై లేదా ఆరుబయట వరండాల్లో నిద్రిస్తున్న నేపథ్యంలో దొంగలు దీనిని అవకాశంగా తీసుకుని ఇండ్లలోకి ప్రవేశించి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు.ఇళ్లకు తాళాలు వేయకుండా కేవలం తలుపులు మూసి నిద్రించడం వల్ల బంగారం, వెండి, నగదు వంటి విలువైన వస్తువులు దొంగిలించబడుతున్నాయని పోలీసులు పేర్కొన్నారు. కొన్నిసార్లు బయట నిద్రిస్తున్న వ్యక్తుల మెడలోని బంగారు గొలుసులు, ఇతర ఆభరణాలు కూడా దోచుకుంటున్న ఘటనలు జరుగుతున్నాయని తెలిపారు. శుభకార్యాల కోసం లేదా బంధువుల ఇళ్లకు వెళ్లే వారు కూడా తమ ఇళ్ల భద్రతపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వీలైనంత వరకు ప్రతి ఇంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

అలాగే గ్రామాలు, కాలనీలలోని ఇళ్లతో పాటు చిన్న, పెద్ద దుకాణాలు, సంస్థలు కూడా తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అవి సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో నిరంతరం పరిశీలించాలని సీ ఐ మన్మధ కుమార్ సూచించారు.

Sthanikam

వేసవిలో దొంగతనాలకు చెక్… పోలీసుల హెచ్చరిక

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News