Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:43 AM

వేసవి లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ ఎ. శ్యాంప్రసాద్

09-05-2026 102 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

పుట్టపర్తి,కలెక్టరేట్ లోని మినీ కన్ఫరెన్స్ హాలు నందు జిల్లాలో ఎక్కడా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా గ్రామస్థాయిలో ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎ. శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. RWS అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన కీలక సూచనలు చేశారు.RWS One App, వాటర్ ట్రాన్స్‌పోర్టేషన్ రిపోర్టులను ప్రతిరోజూ అప్డేట్ చేస్తూ, గ్రామాల వారీగా నీటి సరఫరాను పర్యవేక్షించాలి.నీటి కొరత ఉన్న చోట వెంటనే ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని, అవసరమైతే ప్రైవేట్ బోర్లను వినియోగించుకోవాలని స్పష్టం చేశారు.క్షేత్రస్థాయిలో పైపులైన్లు, మోటార్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి. నీటి నమూనాలను పరీక్షించి, క్లోరినేషన్ ద్వారా ప్రజారోగ్యాన్ని కాపాడాలి.జల్ జీవన్ మిషన్ పనులను వేగవంతం చేయాలని, జిల్లాలో నిర్మాణంలో ఉన్న 271 కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్సులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు."నీటి సమస్యల విషయంలో రాజీ పడకూడదు, ప్రజలకు కనీసం 55 LPCD నీరు అందేలా చూడాలి" అని కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.ఈ కార్యక్రమం లో ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్ఇ మురళీధర్,గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులు, ఇంజినీర్లు మరియు సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

వేసవి లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ ఎ. శ్యాంప్రసాద్

Article Image

పుట్టపర్తి,కలెక్టరేట్ లోని మినీ కన్ఫరెన్స్ హాలు నందు జిల్లాలో ఎక్కడా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా గ్రామస్థాయిలో ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎ. శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. RWS అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన కీలక సూచనలు చేశారు.RWS One App, వాటర్ ట్రాన్స్‌పోర్టేషన్ రిపోర్టులను ప్రతిరోజూ అప్డేట్ చేస్తూ, గ్రామాల వారీగా నీటి సరఫరాను పర్యవేక్షించాలి.నీటి కొరత ఉన్న చోట వెంటనే ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని, అవసరమైతే ప్రైవేట్ బోర్లను వినియోగించుకోవాలని స్పష్టం చేశారు.క్షేత్రస్థాయిలో పైపులైన్లు, మోటార్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి. నీటి నమూనాలను పరీక్షించి, క్లోరినేషన్ ద్వారా ప్రజారోగ్యాన్ని కాపాడాలి.జల్ జీవన్ మిషన్ పనులను వేగవంతం చేయాలని, జిల్లాలో నిర్మాణంలో ఉన్న 271 కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్సులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు."నీటి సమస్యల విషయంలో రాజీ పడకూడదు, ప్రజలకు కనీసం 55 LPCD నీరు అందేలా చూడాలి" అని కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.ఈ కార్యక్రమం లో ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్ఇ మురళీధర్,గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులు, ఇంజినీర్లు మరియు సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News