Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ సీఐ మన్మథ కుమార్‌ ఘన విజయం: జిల్లా పోలీస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నిక “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 02:33 PM

వెలుగుమట్ల భూములు పేదలకే కేటాయించాలి

వెలుగుమట్ల భూములు పేదలకే కేటాయించాలి

వెలుగుమట్ల భూములు పేదలకే కేటాయించాలి
24-02-2026 114 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఇళ్ల కూల్చివేతలు నిలిపివేసి పోలీసులు, అధికారులు వెనక్కి వెళ్లాలని సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ డిమాండ్

ఖమ్మం నగరంలోని వెలుగుమట్ల పార్కు పరిసర ప్రాంతాల్లో గత 15 సంవత్సరాలుగా నివసిస్తున్న పేదలను బలవంతంగా బయటకు పంపించడం, వారి ఇళ్లను కూల్చివేయడం అమానుష చర్య అని సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ తీవ్రంగా ఖండించింది.

ఈ సందర్భంగా తిరుమలాయపాలెం మండల కార్యదర్శి గొర్రెపాటి రమేష్ పత్రికా ప్రకటనలో మాట్లాడుతూ ప్రజా పాలన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలపై దౌర్జన్యాలకు పాల్పడుతోందని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడతామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ప్రస్తుతం ఎక్కడ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతోందో చెప్పాలని ప్రశ్నించారు.

ఏళ్ల తరబడి అక్కడ గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్న పేదలకు భూములు కేటాయించి హక్కులు ఇవ్వాల్సిన ప్రభుత్వం, ఇప్పుడు పోలీసు బలగాలను అడ్డంగా పెట్టుకుని ఇళ్లను కూల్చడం అన్యాయమని అన్నారు. పేదల పక్షాన నిలబడి సంఘీభావం తెలిపిన కమ్యూనిస్టు నాయకులను అరెస్టు చేయడం సరికాదని పేర్కొన్నారు. వెంటనే ఇళ్ల కూల్చివేతలను నిలిపివేసి, అక్కడ నివసిస్తున్న కుటుంబాలకు గృహ హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. పోలీసు బలగాలు, ప్రభుత్వ అధికారులు ఆ ప్రాంతం నుంచి వెనక్కి వెళ్లి పేదలకు రక్షణ కల్పించాలని కోరారు. లేదంటే ప్రజా వ్యతిరేక చర్యలపై ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Sthanikam

వెలుగుమట్ల భూములు పేదలకే కేటాయించాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News