Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:09 PM

వెలిమినేడు సిపిఎం సమావేశం: ధరల పెరుగుదలపై వీరారెడ్డి ఆందోళన

07-04-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో మంగళవారం జరిగిన సిపిఎం గ్రామ జనరల్ బాడీ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యుద్ధ ప్రభావంతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి, గ్యాస్ సరఫరాలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

దేశ ప్రధాని నరేంద్ర మోడీ యుద్ధ నివారణకు చర్యలు తీసుకోవాల్సిన సమయంలో డొనాల్డ్ ట్రంప్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళ ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలు తగవని అన్నారు.

కేరళ ప్రభుత్వం విద్య, వైద్యం, పేదరిక నిర్మూలనలో ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొంటూ, ఇక్కడ కూడా హామీల అమలులో చిత్తశుద్ధి చూపాలని డిమాండ్ చేశారు. అర్హులైన పేదలకు ఇండ్లు, ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని కోరుతూ, లేకపోతే సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

గ్రామ సర్పంచ్ బొంతల చంద్రారెడ్డి గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. నెలికంటి నర్సింహా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిట్ట నగేష్, మల్లం మహేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

వెలిమినేడు సిపిఎం సమావేశం: ధరల పెరుగుదలపై వీరారెడ్డి ఆందోళన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News